Chiranjeevi : ‘ఆచార్య’ ఫ్లాప్‌ తో చిరంజీవికి వందల కోట్ల నష్టం.. ఎలాగో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chiranjeevi : ‘ఆచార్య’ ఫ్లాప్‌ తో చిరంజీవికి వందల కోట్ల నష్టం.. ఎలాగో తెలుసా?

Chiranjeevi : మెగా స్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా వంద కోట్లకు పైగా బిజినెస్‌ చేసింది. ఇప్పడు సినిమా అందులో సగం కూడా వసూళ్లు చేయడం లేదు.. దాంతో బయ్యర్లను చిరంజీవి ఆదుకోవాలంటూ ప్రతి ఒక్కరు కూడా సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. దాంతో చిరంజీవి అభిమానులు ఈ సమయంలో ఒక ఆసక్తికర విషయాన్ని తెర ముందుకు తీసుకు వచ్చి ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.ఆచార్య సినిమా ప్లాప్‌ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :10 May 2022,9:00 pm

Chiranjeevi : మెగా స్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా వంద కోట్లకు పైగా బిజినెస్‌ చేసింది. ఇప్పడు సినిమా అందులో సగం కూడా వసూళ్లు చేయడం లేదు.. దాంతో బయ్యర్లను చిరంజీవి ఆదుకోవాలంటూ ప్రతి ఒక్కరు కూడా సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. దాంతో చిరంజీవి అభిమానులు ఈ సమయంలో ఒక ఆసక్తికర విషయాన్ని తెర ముందుకు తీసుకు వచ్చి ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.ఆచార్య సినిమా ప్లాప్‌ వల్ల బయ్యర్లు నష్టపోయిన మాట వాస్తవమే.. కాని చిరంజీవి బయ్యర్లు నష్టపోయిన దానికి పది రెట్లు నష్టపోయాడు..

ఆయనకు నష్ట పరిహారం చెల్లించేది ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆచార్య సినిమా ప్లాప్ వల్ల ఆయన తదుపరి సినిమాల మార్కెట్‌ పూర్తిగా డౌన్ అవుతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బుల్లో వాటాగా తన పారితోషికంను చిరంజీవి తీసుకునేలా ఒప్పందాలు ఉంటాయి. అలాంటప్పుడు ఆచార్య ప్లాప్‌ ఆ సినిమాలపై ప్రభావం పడటం మాత్రమే కాకుండా చిరంజీవికి రావాల్సిన మొత్తంలో భారీ మొత్తం కట్‌ అవుతుంది.చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్‌.. గాడ్‌ ఫాదర్.. వాల్తేరు వీరన్న సినిమాలు మాత్రమే కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేస్తున్నాడు.

కేవలం ఈ నాలుగు సినిమాల ప్రీ రిలీజ్‌ బిజినెస్ లపై ప్రభావం పడటం వల్ల చిరంజీవికి వందల కోట్ల పారితోషికం తగ్గే అవకాశం ఉందని.. ఆయన ఈ నష్టంను ఎవరు భరిస్తారు అంటున్నారు. ఆ నాలుగు సినిమాల్లో ఏదో ఒక సినిమా సక్సెస్ అయితేనే ఆయనకు కనీసం మిగులుబాటు ఉంటుంది. కనుక ఆయన్ను కూడా ఈ విషయంలో విమర్శించడానికి లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు. చిరంజీవిని రిక్వెస్ట్‌ చేసి తదుపరి సినిమా హక్కులను ఇవ్వమనాలే కాని డిమాండ్‌ చేసి డబ్బులు వసూళ్లు చేయడం అనేది కరెక్ట్‌ కాదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది