chiranjeevi daughter sushmita konidela produce crazy project
Sushmita Konidela : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి దాదాపు డజను మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చిన సంగతి అందరికీ విదితమే. ఇకపోతే ఆయన కూతురు సుస్మిత కొణిదెల కూడా ఇండస్ట్రీలోకి కాస్టూమ్ డిజైనర్‌గా ఎంట్రీ ఇచ్చి బాగా పాపులారిటీ సంపాదించుకుంది. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసి ఇటీవల ఆమె ప్రొడ్యూసర్‌గానూ మారింది. ఈ క్రమంలోనే తన బ్యానర్ ద్వారా వెరీ డిఫరెంట్ స్టోరిస్ ప్రేక్షకులకు చెప్పాలని అనుకుంటోంది సుస్మిత. కాగా, తాజాగా సుస్మిత ఓ ప్రాజెక్టు విషయమై డేర్ స్టెప్ వేసిందన్న వార్త సోషల్ మీడియాతో పాటు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ న్యూస్ ఏంటంటే..
chiranjeevi daughter sushmita konidela produce crazy project
టాలీవుడ్ సినీ వర్గాల్లోనూ సుస్మిత కొణిదెల క్రేజీ ప్రాజెక్టు చేయబోతుందన్న టాక్ వినబడుతోంది. ఆ టాక్ ప్రకారం.. ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి ఈ ఉమన్ సెంట్రిక్ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేయబోతున్నది. ఇప్పటికే సదరు ప్రాజెక్టుకు సంబంధించిన స్టోరిని కృతిశెట్టికి వినిపించగా, ఆమెకు స్టోరి లైన్ నచ్చేసి ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. అయితే, జనరల్‌గా లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు గతంలో పలు సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్స్‌నే సెలక్ట్ చేసుకుంటారు. కానీ, ఇక్కడ ఓకే ఒక్క సినిమాను సెలక్ట్ చేసి చిరంజీవి కూతురు సుస్మిత డేరింగ్ స్టెప్ తీసుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేయబోయే ఈ ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్‌కు విరించి వర్మ డైరెక్టర్ అని సమాచారం. విరించి వర్మ గతంలో ‘ఉయ్యాల జంపాల, మజ్ను’ సినిమాలు చేశారు. కృతిశెట్టితో చేయబోయే సినిమా ద్వారా విరించి వర్మ డిఫరెంట్ జోనర్ టచ్ చేయబోతున్నారని వినికిడి. స్టోరి లైన్‌పై విరించి వర్మతో పాటు సుస్మిత కొణిదెల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారట. హీరోయిన్ కృతిశెట్టి ప్రజెంట్ ‘బంగార్రాజు’ చిత్ర షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంది. కృతిశెట్టి నటించిన నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ పిక్చర్ ఈ నెల 24న విడుదల కానుంది.
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
This website uses cookies.