Raghavendra Rao : తెలుగు సినిమా ప్రేక్షకులకు డైరెక్టర్ రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సృష్టించాడు ఆయన. అప్పట్లో ఆయన తీసిన సినిమాలు చరిత్రను సృష్టించాయి. ప్రతి సినిమా ఒక దృశ్య కావ్యం. ఆయన తీసే సినిమాలో నటించేందుకు నటీనటులు పోటీ పడేవారంటే అర్థం చేసుకోవచ్చు.. ఆయన దర్శకత్వానికి ఎంత డిమాండ్ ఉంటుందో.గత ఆరు దశాబ్దాల నుంచి ఇప్పటి వరకు ఆయన్ను ఢీకొట్టే దర్శకుడు రాలేదంటే.. ఆయన ప్రతిభ ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఆయన స్టయిలే వేరు. అప్పట్లో ఎన్టీఆర్ తో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసి.. నేడు.. కుర్ర హీరోలతో సినిమాలు తీసి కూడా అంతే స్థాయి విజయాన్ని అందుకున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లు ప్రస్తుతం కొనసాగుతున్న చాలామంది డైరెక్టర్లు.. రాఘవేంద్రరావు శిష్యులే. ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి కూడా రాఘవేంద్రరావు శిష్యుడే. అయితే.. రాఘవేంద్రరావు సినిమాల్లో ఆయన పేరు వెనుక ఉండే బీఏ అనే పదాన్ని ఎప్పుడైనా మీరు గమనించారా?ఆయన ప్రతి సినిమా టైటిల్ లో ఆ పేరు చివర్లో ఖచ్చితంగా ఉంటుంది. అదేదో.. ఆయన బీఏ చదివాడు కాబట్టి.. అందుకోసం.. బీఏ అని రాయించుకున్నాడు అని అనుకుంటున్నారేమో. కాదు.. దాని వెనుక పెద్ద చరిత్రే ఉంది.నిజానికి రాఘవేంద్రరావు చదివింది బీఏనే. కానీ.. ఒకవేళ ఆయన డైరెక్టర్ కాకపోయి ఉంటే.. ఏ డ్రైవరో..
లేక వేరే ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతికేవాడినని చాలా సందర్భాల్లో చెప్పారు.రాఘవేంద్రరావు.. కెరీర్ తొలినాళ్లలో.. డైరెక్ట్ చేసిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయట. ఆ సినిమాలకు చివర బీఏ అని చేర్చాడట ఆయన. ఆ తర్వాత ఒక సినిమాకు ఎందుకో బీఏ అని పేరు పెట్టుకోలేదట. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందట.ఆ తర్వాత సినిమాకు మళ్లీ బీఏ అని పెట్టాడట. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందట. అప్పటి నుంచి ఇక.. తన సినిమాలన్నింటికీ బీఏ అని ఖచ్చితంగా పెడుతున్నాడట రాఘవేంద్రరావు. అదే లెగసీ ఇప్పటికీ కొనసాగుతోంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.