Chiranjeevi : గోపిచంద్‌తో ఉన్న సంబంధం గురించి నోరు విప్పిన చిరంజీవి
Chiranjeevi : చివరిగా సీటీమార్ సినిమాతో ప్రేక్షకులని పలకరించిన గోపిచంద్ జూలై 1న పక్కా కమర్షియల్ చిత్రంతో పలకరింబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాశీ ఖన్నా కథానాయికగా నటించింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో గల శిల్పా కళా వేదికలో గ్రాండ్ గా జరగగా, మెగా మ్యాచో ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజ్ కూడా హాజరై ఈవెంట్ ను సక్సెస్ చేశారు. చిరంజీవి హీరో గోపీచంద్, దర్శకుడు మారుతీ గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు.
ఆయన మాట్లాడుతూ.. గోపీచంద్ తో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. గోపీచంద్ తండ్రి, దర్శకుడు టీ క్రిష్ణ ఆయన స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఒంగోల్‌లో కలిశారు. ఆయన బీఏ చదువుతుండగా.. నేను ఇంటర్ చదువుతున్నాను. ఆ సమయంలో స్టూడెంట్ యూనియన్ లీడర్ గా ఆయన నాకు చాలా భరోసా ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన స్ఫూర్తి నాకు ఓ ధైర్యంగా ఉంటుంది. ఎప్పుడూ మేం సినిమా చేసే అవకాశం రాలేదు. ఆయన దర్శకత్వం వహించిన రెవెల్యూషన్ చిత్రాలు అద్భుతంగా ఆడాయి. ఆ బంధంతోనే గోపీచంద్ తో రిలేషన్ కొనసాగుతోంది. గోపీ నటించిన సాహసం, చాణక్య వంటి వైవిధ్యమైన సినిమాలు నాకు చాలా నచ్చాయి.
Chiranjeevi : చిరు క్లారిటీ..
ఈ సినిమా కూడా ఆయనకు మంచి విజయం అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మారుతి గురించి మాట్లాడిన చిరు.. మారుతీ నేను రాజకీయ ప్రవేశం సమయంలో పరిచయం అయ్యాడు. ప్రజారాజ్యం పార్టీ స్థాపన సందర్భంగా పార్టీ జెండాను గ్రాఫికల్ డిజైన్ చేసేందుకు ఓ అబ్బాయి కావాలని వెతకగా మారుతీ తగిలాడు. ఆ సమయంలో మారుతీని రెండు రోజులు మా ఇంట్లోనే ఉంచుకొని చాలా చర్చించాం. ఆ తర్వాత చిన్న వీడియోను షూట్ చేసుకొని రమ్మని చెప్పగా.. అద్భుతంగా చిత్రీకరించాడు. అప్పుడే ‘నీలో దర్శకుడు ఉన్నాడు’ అని చెప్పాను.రానున్న రోజులలో ఆయన మంచి డైరెక్టర్ అవుతారు అని చిరు అన్నారు.