Chiranjeevi:నిన్నటి వరకు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాల మీద భారీ అంచనాలుండేవి. కానీ, తాజాగా వచ్చిన ఆచార్య సినిమా ఫలితం ఇప్పుడు అన్నీ సినిమాల మీద కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. కొరటాల కెరీర్‌లో వరుసగా నాలుగు భారీ హిట్స్ ఉన్న కారణంగా చిరంజీవి ఆయనకు ఆచార్య సినిమా అవకాశం ఇచ్చారు. అది కాస్తా మెగా మల్టీస్టారర్‌గా మార్చారు కొరటాల. దాంతో అభిమానులు కోరుకున్న భారీ మెగా మల్టీస్టారర్ వస్తుందని ఆశపడ్డారు.కానీ, కొరటాల ఇద్దరు మెగా హీరోలు దొరికే సరికి కథ – కథనం గురించి మర్చిపోయి
వారిద్దరినీ ఎలా స్క్రీన్ మీద చూపించాలనే ఆలోచనతోనే సినిమానుతీశాడు. దాంతో కథలేని..పాత చింతకాయ పచ్చడి లాంటి ఆచార్య తయారైంది. ఇక భారీ స్థాయిలో థియేటర్స్‌లోకి వచ్చిన ఆచార్య కనీసం 24 గంటలు కూడా గడవక ముందే చాలా థియేటర్స్‌లో ఎత్తేయడం షాకింగ్ విషయం. ఇలా మెగాస్టార్ కెరీర్‌లో ఎప్పుడూ జరగలేదని చెప్పాలి. గతంలో చిరు సినిమా ఫ్లాపయినా కనీసం మొదటి వారం అయినా ఆడించేవారు.కానీ, ఆచార్య విషయంలో మాత్రం అంత సాహసం చేయలేకపోతున్నారు.
అందుకే, ఆర్ఆర్ఆర్ లేదా కేజీఎఫ్ 2 చిత్రాలను రెండవ రోజు నుంచే ప్రదర్శించడం మొదలు పెట్టారట. ఇప్పుడు ఈ ప్రభావంతో మెగా ఫ్యాన్స్ చిరు నెక్స్ట్ సినిమాల గురించి కంగారు పడుతున్నారు. మోహన్ రాజాకు మన టాలీవుడ్ సినిమాను తెరకెక్కించిన అనుభవం లేదు. కాబట్టి గాడ్ ఫాదర్ సినిమా ఎలా ఉంటుందో అని ఒక వైపు భయపడుతున్న ఫ్యాన్స్, కనీసం వార్తల్లో కూడా లేని మెహర్ రమేశ్ చేతికి భోళా శంకర్ సినిమాను అప్పగించడం..అలాగే, మెగా 154 చిత్రాన్ని బాబీకి, ఆ తర్వాత చిత్రాన్ని రెండు మీడియం సినిమాలను తీసి హిట్ అందుకున్న వెంకీ కుడుమలతో చేస్తున్నారు. ఈ లైనప్‌కు ఇప్పుడు మెగా అభిమానులు కంగారు పడుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.