Chiranjeevi : 40 ఏళ్లలో నేను సాధించలేనిది.. నా బిడ్డలు సాధించారు చరణ్, ఎన్టీఆర్ లపై చిరంజీవి వైరల్ కామెంట్స్.. వీడియో వైరల్..!!

Advertisement

Chiranjeevi : “RRR” లో నాటు నాటు సాంగ్ కీ ఆస్కార్ రావటం తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క పేరు మారుమోగుతుంది. ఇదే సమయంలో “RRR” సినిమా యూనిట్ ని ప్రధాని మోడీతో పాటు తెలుగు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇంకా చాలామంది రాజకీయ నేతలు సినిమా హీరోలు ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. “RRR”కీ ఆస్కార్ రావటం నిజంగా అందరూ సంతోషించదగ్గ విషయమని స్పష్టం చేశారు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే దేశంలోనే వేరే ప్రాంతాలలో ఎవరికీ తెలిసేది కాదు.

Advertisement
Chiranjeevi First Reaction On RRR Oscar
Chiranjeevi First Reaction On RRR Oscar

40 ఏళ్ల నా సినీ కెరియర్లో గతంలో తెలుగు చిత్రాలకు గుర్తింపు లేదని పలుమార్లు చెప్పినట్లు కూడా.. చిరంజీవి ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే ఇప్పుడు “RRR” తో తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఆ టైంలో నేను సాధించలేనిది.. వీలు సాధించారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పెంచేశారు. ఈ క్రమంలో RRR కీ ఆస్కార్ అవార్డు రావడంలో చరణ్, ఎన్టీఆర్ ఇంకా రాజమౌళి బాగా కృషి చేశారు. ముఖ్యంగా ఈ సినిమాకి ఆస్కార్ రావాలని

Advertisement

Oscars 2023: Chiranjeevi On Cloud Nine As 'Naatu Naatu' Wins Oscar For Best  Original Song

చేసిన ప్రమోషన్ కార్యక్రమాల సమయంలో… ఇతర దేశాల నుండి వచ్చిన స్పందన అత్యద్భుతం. ఒక తండ్రిగా బిడ్డ పై స్థాయికి ఎదుగుతుంటే.. ఎవరికైనా గర్వకారణంగా ఉంటుంది అంటూ చిరంజీవి.. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందే గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు… రావటంతో కచ్చితంగా “RRR” ఆస్కార్ గెలిచే ఆస్కారం ఉందని అంచనా వేశాను. ఆ రీతిగానే “RRR”కీ ఆస్కార్ అవార్డు రావడం నిజంగా తెలుగు వాళ్ళు గర్వించదగ్గ విషయమని చిరంజీవి తన సంతోషాన్ని తెలియజేశారు.

Advertisement
Advertisement