Chiranjeevi : ‘చిరంజీవి’ ప్రయత్నాలు ఫలించేనా..?
Chiranjeevi : కన్నడ సినిమా ఇండస్ట్రీలో పూర్తి విలక్షణమైన నటుడు ఉపేంద్ర. అక్కడ హీరోగా ఎ, ఉపేంద్ర లాంటి విభిన్నమైన సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తుంపును తెచ్చుకున్నాడు. కమర్షియల్, డీసెంట్ కథలను అసలు ఒప్పుకోరు. ఎంత వైవిధ్యంగా ఉంటే అంత త్వరగా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ఉపేంద్ర. హీరోగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఆయన తెలుగులో అద్భుతమైన క్యారెక్టర్స్ చేసి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. నటుడిగా, నిర్మాతగా మాత్రమే కాకుండా దర్శకుడిగా ఉపేంద్ర చాలా పాపులర్.
టాలీవుడ్ స్టార్ హీరో డా.రాజశేఖర్ హీరోగా ఓకారం అనే సినిమాను తీసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇందులో హీరోయిన్‌గా ప్రేమ నటించింది. అయితే, ఇదే సినిమా షూటింగ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. కానీ, సినిమా మధ్యలో వదిలేసి మరో సినిమాను ఒప్పుకోవడం కరెక్ట్ కాదనే ఆలోచనతో అప్పుడు మెగాస్టార్‌తో సినిమా చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ మళ్ళీ ఛాన్స్ దక్కలేదు. ముఖ్యంగా చిరంజీవి రాజకీయాలలోకి వెళ్ళడంతో 10 ఏళ్ళపాటు ఎవరికీ ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం లేకపోయింది. రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు కమిటయ్యారు.

Chiranjeevi learns about Upendra Waiting
Chiranjeevi : ఈ కాంబోలో ఓ విభిన్నమైన సినిమా రావడం గ్యారెంటీ..!
ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ దూకుడు చూస్తే వీలైనంత త్వరగా 175 సినిమాల మార్క్‌ను చేరుకుంటారనిపిస్తోంది. అందుకే, యంగ్ డైరెక్టర్స్ నుంచి సీనియర్ డైరెక్టర్స్ వరకూ దాదాపు అందరూ మెగాస్టార్‌ను డైరెక్ట్ చేయడం కోసం తహ తహాలాడుతున్నారు. వారిలో ఉపేంద్ర కూడా ఉన్నారు. చిరంజీవి గనక అపాయింట్మెంట్ ఇస్తే కలిసి కథ చెప్పాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే, సన్నిహిత వర్గాల ద్వారా ఉపేంద్ర వెయిటింగ్ గురించి చిరంజీవి తెలుసుకున్నారట. త్వరలో ఆయన ఉపేంద్రకు సమయం కేటాయించనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగి కథ సెట్ అయితే, ఈ కాంబోలో ఓ విభిన్నమైన సినిమా రావడం గ్యారెంటీ అనుకోవచ్చు.