Chiranjeevi : వేణు స్వామి గురించి చెప్పకనే చెప్పిన చిరంజీవి… వాడి మాటలు నమ్మి మోసపోకండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : వేణు స్వామి గురించి చెప్పకనే చెప్పిన చిరంజీవి… వాడి మాటలు నమ్మి మోసపోకండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :1 April 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Chiranjeevi : వేణు స్వామి గురించి చెప్పకనే చెప్పిన చిరంజీవి... వాడి మాటలు నమ్మి మోసపోకండి...!

Chiranjeevi : తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంతటి ప్రజాధరణ ఉందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా ఆయన అంటే ఇష్టపడని వారు ఉండరు. అంతేకాక ఎవరి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి అభిమానమే. అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్నో రకాల పాత్రలతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఇప్పటికీ కూడా పలు రకాల సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఇక ఇప్పుడు కొడుకు రామ్ చరణ్ తో పాటు పోటీ పడుతూ సినిమాలు తీస్తూ వస్తున్నారు. అందుకే చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి ఎంతగానో అభిమానం ఉంటుంది. ఆయన స్వయంకృషి చూసి ఎవరైనా చేతులెత్తి దండం పెట్టాల్సిందే. ఇక చిరంజీవి ప్రస్తావన వస్తే చాలు చాలామంది ఇప్పటికీ అనర్గలంగా ఆయన గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. అంతేకాక నేటి కాలంలో ఎంతోమంది నటీనటులకు , ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి ఆయన ఆదర్శం అని చెప్పాలి.

Chiranjeevi  తాజాగా చిరంజీవి ఇంటర్వ్యూ లో..

అయితే తాజాగా చిరంజీవి విజయ్ దేవరకొండ తో కలిసి ముఖాముఖి ఇంటర్వ్యూ లో మాట్లాడడం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులు , పలువురు సెలబ్రిటీగా హాజరవడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మరియు విజయ్ దేవరకొండల మధ్య సంభాషణలు చూడముచ్చట కనిపించాయి. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… మీరు ఎలాంటి సపోర్ట్ లేకుండా స్వయంకృషిగా ఎదిగిన వ్యక్తి…కానీ చాలా సందర్భాలలో తలరాత , జాతకాల గురించి మనం ఎక్కువసార్లు వింటూ ఉంటాం.మరి దీనిపై మీ అభిప్రాయాలు ఏంటని చిరంజీవిని అడగగా…చిరంజీవి సమాధానం ఇస్తూ…జాతకాలు చేతిరాతలు తలరాతలను నేను అస్సలు నమ్మనని ఏదైనా సరే మనం సాధించాలనే సంకల్పం మనలో ఉండాలి తప్ప ఇలాంటి జాతకాలను చేతిరాతలను అసలు నమ్మకూడదని చెప్పుకొచ్చారు.

ఎవరైనా సరే నేను ఇది చేయగలను అంటే చేసి చూపించాలి తప్పవెనకడుగు వెయ్యవద్దని గమ్యం చేరేంతవరకు ముందడుగు వేస్తూనే ఉండాలంటూ ఈ సందర్భంగా చిరంజీవి చెప్పుకొచ్చారు. స్వామీజీల మాటలను నమ్మి అది చేస్తాం ఇది చేస్తామని మూర్ఖంగా ప్రవర్తించకుండా మీకు కావాల్సిన దానికోసం కష్టపడి పనిచేయండి , కృషితో ముందుకు వెళ్లండని ఈ సందర్భంగా చిరంజీవి చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం చిరంజీవి చేసిన వ్యక్తులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. ఇక ఈ మాటలు ఆస్ట్రాలజీ వేణుస్వామికి కాస్త కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి వేణు స్వామి గురించి చెప్పకుండానే అతనికి మంచి కౌంటర్ వేశాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది