Chiranjeevi : చిరంజీవి, మోహన్ బాబుల కీలక భేటీ.. ఈ సమస్యలు ఇప్పటికైనా తీరుతాయా?
Chiranjeevi : చిరంజీవి,మోహన్ బాబు ఈ ఇద్దరు హీరోలు తెలుగు ఇండస్ట్రీలో తమకంటూ ఒక రేంజ్ ను ఏర్పరుచుకున్న హీరోలు వీరు . మంచి,మంచి సినిమాలను చేస్తూ విజయాలను వారి ఖాతాలో వేసుకున్నారు. ఈ ఇద్దరు హీరోలు. ఈ ఇద్దరు హీరోలు కలిసి చేసిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.ఈ హీరోలు ఇద్దరు కూడా ప్రస్తుతం ఉప్పు,నిప్పు లాగ ఉన్నారు.మరి ఈ హీరోలిద్దరూ ఈ సమావేశంలో దేనికోసం పాల్గొన్నట్టున్నారు వివరాల్లోకి వెళితే…ఇండస్ట్రీలోని 24 క్రాఫ్టులకు సంబందించిన ప్రతినిధులు, దాదాపు 200 మంది ప్రతినిధుల తో పాటు చిరంజీవి, మోహన్ బాబు, మురళీమోహన్ వంటి పెద్ద హీరోలతో పాటు మా అధ్యక్షుడు విష్ణు కూడా , ఈ టాలీవుడ్ సంచలనం సమావేశానికి పాల్గొంటున్నట్టు తెలిసింది.
ఈ సమావేశానికి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ వేదిక కానుంది. అయితే చాలా కాలం తర్వాత చిరంజీవి, మోహన్ బాబు ఒకే వేదికపై కనిపించడంతో ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లో నూ, ఉత్కంఠను నెలకొల్పుతుంది.ఈ సమావేశం ఎందుకనగా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి, అన్ని విభాగాలు ఒక్కతాటిపైకి వచ్చే ప్రయత్నానికి, ముహుర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది . ఈ సమావేశం ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరుగుతున్నట్టు తెలిసింది.
Chiranjeevi :200 మంది ప్రతినిధులతో..
కరోనా సమయంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొన్న టువంటి సమస్యల గురించి, ఇటీవల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం చిత్ర పరిశ్రమ మీద చేసిన జీవోలను గురించి, సినీ కార్మికుల సంక్షేమం గురించి, ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఈ సమావేశాన్ని జరుపుతున్నట్టు సమాచారం. అయితే ఈ వేదికపై చిరు, మోహన్ బాబు మాట్లాడుకుంటారా లేదా అన్నది ఇక్కడ పెద్ద హాట్ టాపిక్ గా మారుతోంది. కానీ చాలామంది పెద్దలు వారి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించాలని చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.