Chiranjeevi – Pawan Kalyan : అన్నదమ్ములిద్దరిదీ ఒకే స్ట్రాటజీనా.. అందుకే వెతుక్కుంటూ ఇంకా అవకాశాలు వస్తున్నాయా?
Chiranjeevi – Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలు వదిలేశారు కానీ.. రాజకీయాలు మాత్రం ఆయన్ని వదలడం లేదు. వద్దు వద్దు అనుకుంటున్నా కూడా రాజకీయాలు ఆయన చుట్టే తిరుగుతున్నాయి. ఇటీవల ఆయన ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాజకీయాలపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఇదే మొదటిసారి. అందుకే ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత రాజకీయాల్లో చిరు సైలెంట్ అయిపోయారు. అఫ్ కోర్స్ కొన్ని రోజులు కేంద్ర మంత్రిగా పని చేశారు. అది వేరే విషయం. ఇప్పుడు తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఏపీలో అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ ఏపీలో అనధికారికంగా మూడో స్థానంలో ఉందనే చెప్పుకోవాలి. కానీ.. పొత్తులతో ఎన్నికల బరిలో దిగితే జనసేన ప్రభావం గట్టిగానే ఉండనుంది.
Chiranjeevi – Pawan Kalyan : రీమేక్ సినిమాల్లో ముందుంటున్న అన్నదమ్ములు
ఇక.. వాళ్ల రాజకీయాలను కాసేపు పక్కన పెడితే.. ఇద్దరి సినిమాల గురించి కాసేపు మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఇద్దరు అన్మదమ్ములు రీమేక్ సినిమాల మీద పడ్డారు. మెగాస్టార్ చిరంజీవి అయితే.. గాడ్ ఫాదర్, భోళా శంకర్ ఈ రెండు సినిమాలు రీమేక్ సినిమాలే. ఇక పవన్ ఇటీవల నటించిన బ్రో సినిమాతో పాటు ఇంతకుముందు నటించిన కాటమరాయుడు, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ అన్నీ రీమేక్ లే. ఏది ఏమైనా ఇద్దరు అన్నదమ్ములు రీమేక్ లు చేస్తూ ఇండస్ట్రీలో హిట్స్ కొడుతూ మెగాస్టార్, పవర్ స్టార్ గా తమ స్థానాన్ని పదిలపరుచుకుంటున్నారు. ఎంతైనా వాళ్ల స్ట్రాటజీయే వేరు అంటున్నారు మెగా అభిమానులు.