
chiranjeevi pawan kalyan Balakrishna one stage
Chiranjeevi : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా దాదాపుగా పది మంది కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వారి సినిమాలు వస్తే చాలు సినీ అభిమానులు అందరు తప్పకుండా వాటిని చూస్తుంటారు. అయితే, ఈ స్టార్ హీరోలు అందరు ఒకే వేదికపైకి వస్తే ఎలా ఉంటుంది? ఊహించుకోండి.. అత్యద్భుతం కదా.. అయితే, అలా అందరూ ఒకేసారి ఒకే ప్లేస్‌కు వచ్చే చాన్సెస్ చాలా తక్కువేనన్న మీరు అనుకోవచ్చు. అది నిజమే కూడా.. కానీ, ఇప్పుడు అటువంటి అరుదైన సంఘటన జరగబోతుందని టాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకే వేదికను పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి పంచుకోబోతున్నారట.. అదెక్కడ.. ఎప్పుడు అన్న విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరిని ఫుల్లీ రీడ్ చేయాల్సిందే.
chiranjeevi pawan kalyan Balakrishna one stage
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా షూటింగ్ పూర్తి కాగానే మరో చిత్ర షూటింగ్‌లో పాల్గొనడంతో పాటు ప్యారలల్‌గా ఇంకో సినిమా షూటింగ్‌లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తంగా అభిమానులకు వారి తదుపరి చిత్రాలపై ఆసక్తి పెంచుతున్నారు. ఈ క్రమంలోనే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పైన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నందమూరి నటసింహం బాలకృష్ణ చిత్రాలు చేయబోతున్నారు. చిరంజీవి-బాబీ కాంబోలో మాస్ ఎంటర్‌టైనర్ రాబోతుంది. ఇప్పటికే చిరు బర్త్ డే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కాంబోలో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సూపర్ సక్సెస్ ఫుల్ ఫిల్మ్ కాగా, ఈ సారి వారు ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే చిత్రాన్ని తీస్తున్నారు.
Chiranjeevi
నందమూరి బాలకృష్ణతో మాస్ ఎంటర్‌టైనర్ తీసేందుకు ‘క్రాక్’ ఫేమ్ గోపీచంద్ మలినేని సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబో ఫిక్స్ అయింది. ఈ క్రమంలో ఈ మూడు చిత్రాల ఓపెనింగ్ విజయదశమి రోజున గ్రాండ్‌గా చేయాలనేది మైత్రీ మూవీ మేకర్స్ ఆలోచన. ఇందుకు ముగ్గురు హీరోలను పిలవాలని అనుకుంటున్నారు. అయితే, పవన్ కల్యాణ్, చిరంజీవి ఒకే వేదిక మీదకు రావడం ఓకే చెప్తారేమో. కానీ, ఈ వేడుకకు బాలయ్య హాజరవుతారా? అని చర్చ నడుస్తున్నది.. చూడాలి మరి మైత్రీ మూవీ మేకర్స్ ముగ్గురు హీరోలను ఒప్పించి అభిమానులకు కన్నుల పండువగా అయేలా చేస్తారో లేదో.. దసరా రోజున హ్యాపీగా తమకు నచ్చిన ముగ్గురు హీరోలను అభిమానులు ఒకే వేదిక మీద చూస్తారో లేదో తెలియాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.
Pawan kalyan
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.