Chiranjeevi – Ram Charan : ఇద్దరు మెగా హీరోలకు కూడా ఆ సత్తా లేకపోయింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chiranjeevi – Ram Charan : ఇద్దరు మెగా హీరోలకు కూడా ఆ సత్తా లేకపోయింది..!

Chiranjeevi – Ram Charan : ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలున్న సినిమాలో ఆచార్య కూడా ఒకటి. ఎందుకంటే, ఈ ప్రాజెక్ట్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మెగా మల్టీస్టారర్ కావడం మొదటి ప్రత్యేకత. టాలీవుడ్ లెజండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి..ఆయన తనయుడు టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఒకే ఫ్రేం లో కొన్ని క్షణాలు కనిపిస్తేనే సంబరపడే మెగా అభిమానులకు ఇద్దరు కలిసి పూర్తి స్థాయిలో కనిపిస్తే ఎలా […]

 Authored By govind | The Telugu News | Updated on :17 May 2022,9:00 pm

Chiranjeevi – Ram Charan : ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలున్న సినిమాలో ఆచార్య కూడా ఒకటి. ఎందుకంటే, ఈ ప్రాజెక్ట్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మెగా మల్టీస్టారర్ కావడం మొదటి ప్రత్యేకత. టాలీవుడ్ లెజండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి..ఆయన తనయుడు టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఒకే ఫ్రేం లో కొన్ని క్షణాలు కనిపిస్తేనే సంబరపడే మెగా అభిమానులకు ఇద్దరు కలిసి పూర్తి స్థాయిలో కనిపిస్తే ఎలా ఉంటుందో అనే ఆసక్తిని రేపిన సినిమా ఆచార్య. ఇక ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా ఎరగని దర్శకుడు కొరటాల శివ. ఇది మరో ప్రత్యేకత.

ఆయన కథలు సామాజిక అంశంతో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గానూ, మంచి మెసేజ్ ఓరియెంటెడ్‌గానూ ఉంటాయి. కాబట్టే ఆచార్య సినిమా మీద ఇండియాతో పాటు యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రెజీనాతో ఐటెం సాంగ్, సంగీతతో మరో స్పెషల్ సాంగ్..మణిశర్మ సంగీతం..ఇలా చాలా ప్రత్యేకతలు ఉన్న ఆచార్య సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో అని అందరూ ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. కానీ, ఆచార్య సినిమా ఆశించిన దాంట్లో కనీసం సగానికి సగం కూడా వసూళ్ళు రాబట్టలేకపోయింది.

Chiranjeevi Ram Charan Also That power is gone

Chiranjeevi Ram Charan Also That power is gone

Chiranjeevi – Ram Charan : యూఎస్ బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్స్ కూడా రాబట్టలేకపోయింది.

ఈ సినిమా చూసి మెగా అభిమానులే తలలు బాదుకున్నారు. ఇదేం సినిమా..ఇలా తీశారు. ఇద్దరు మెగా హీరోలున్నా కూడా పసలేని కథతో ఇంత బడ్జెట్ పెట్టి ఇన్నేళ్ళు సినిమా తీయడం వల్ల ఒరిగిందేంటీ అని మాట్లాడుకున్నారు. కనీసం లాంగ్ రన్‌లో అయినా ఆచార్య మూవీ కాస్తో కూస్తో లాభాలను తెచ్చిపెడుతుందని ఆశించారు. కానీ, మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా తేలిపోయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటించిన ఈ సినిమా మీద పాన్ ఇండియన్ లెవల్‌లో అంచనాలు ఏర్పడితే ఇద్దరు స్టార్ ఉన్న ఈ సినిమా కనీసం యూఎస్ బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్స్ కూడా రాబట్టలేకపోయింది.

Also read

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది