Chiranjeevi : చిరంజీవి స‌ర‌స‌న ముదురు భామ‌.. అంత రిస్క్ ఎందుకంటూ ఫ్యాన్స్ ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : చిరంజీవి స‌ర‌స‌న ముదురు భామ‌.. అంత రిస్క్ ఎందుకంటూ ఫ్యాన్స్ ఫైర్

 Authored By ramu | The Telugu News | Updated on :23 February 2025,7:15 pm

ప్రధానాంశాలు:

  •  Chiranjeevi : చిరంజీవి స‌ర‌స‌న ముదురు భామ‌.. అంత రిస్క్ ఎందుకంటూ ఫ్యాన్స్ ఫైర్

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi హిట్‌, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తున్నారు. రీఎంట్రీ మూవీ ఖైదీ నెం 150 త‌ర్వాత చిరుకి పెద్ద హిట్ ఒక్క‌టి ప‌డ‌లేదు. ఇప్పుడు ఆయ‌న విశ్వంభ‌ర చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మయ్యాడు. మరోవైపు ‘దసరా’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి ఒక సినిమా చేస్తున్నారు.

Chiranjeevi చిరంజీవి స‌ర‌స‌న ముదురు భామ‌ అంత రిస్క్ ఎందుకంటూ ఫ్యాన్స్ ఫైర్

Chiranjeevi : చిరంజీవి స‌ర‌స‌న ముదురు భామ‌.. అంత రిస్క్ ఎందుకంటూ ఫ్యాన్స్ ఫైర్

Chiranjeevi అవ‌స‌ర‌మా ?

ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఒకప్పడు తన అందచందాలతో బాలీవుడ్ ను ఊపేసిన రాణీ ముఖర్జీ ఈ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు హీరో నాని Nani సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందట. ఆ పాత్రకు రాణీ ముఖర్జీ అయితే బాగుంటుందని శ్రీకాంత్ ఓదెల చెప్పగా… చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇదే వార్త బాలీవుడ్ సర్కిల్స్ లో కూడా ట్రెండ్ అవుతోంది.

యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా రూపొంద‌నున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర చాలా కీలకమట. అది కూడా మధ్య వయస్కురాలి పాత్రట. గొప్ప నటీమణులు మాత్రమే పోషించదగ్గ పాత్ర అని తెలుస్తున్నది.ఆ పాత్రకు రాణీ ముఖర్జీ rani mukherjee పేరును సూచించారట దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల. ఆ ప్రపోజల్‌కి చిరంజీవి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారట. తన వయసుకు తగ్గట్టుగా, డిగ్నిఫైడ్‌గా ఉంటుందని చిరంజీవి కూడా అనుకున్నార‌ట‌.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది