Chiranjeevi : చంటబ్బాయ్‌లో చిరంజీవి లేడి గెటప్ వెనక అంత కహానీ నడిచిందా?
ప్రధానాంశాలు:
Chiranjeevi : చంటబ్బాయ్‌లో చిరంజీవి లేడి గెటప్ వెనక అంత కహానీ నడిచిందా?
Chiranjeevi : హీరోలు లేడి గెటప్స్‌లో కనిపించి కనువిందు చేస్తున్నారు. ‘చంటబ్బాయ్’ సినిమాలోని ‘నేనో ప్రేమ పూజారి’ పాటలో లేడి గెటప్ కనిపించారు చిరంజీవి Chiranjeevi. ఇలాంటి రోల్ చేయడం ఏ నటుడికైన ఒక సవాలే. అయితే ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా అందుబాటులోకి వచ్చింది. ఏఐ అద్భుతాలు చేస్తోంది. ఒక ఫోటో ఇచ్చిన దాన్ని లేడి గెటప్ లోకి మార్చమంటే వందల వెర్షన్స్ వస్తున్నాయి.

Chiranjeevi : చంటబ్బాయ్‌లో చిరంజీవి లేడి గెటప్ వెనక అంత కహానీ నడిచిందా?
Chiranjeevi పెద్ద రిస్కే..
కాని అప్పట్లో లేడి గెటప్ వేయడం పెద్ద సవాలే. చంటబ్బాయ్ Chantabbay సినిమాలో గౌనుతో తలపై టోపీ పెట్టుకొని కనిపిస్తారు. ఈ గెటప్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని ఇటీవల పంచుకున్నారు చిరంజీవి Chiranjeevi . ‘‘జంధ్యాల గారు లేడీ గెటప్ గురించి చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. అయితే, మీసాలు తీసేయాలని చెప్పారు. దాంతో నేను ఒక కండీషన్ పెట్టాను. అప్పుడు సెట్‌లో దాదాపు 60-70 మంది పనిచేస్తున్నారు. ‘వారందరూ మీసాలు తీస్తే, ఆఖరుగా తీసేవాడిని నేనవుతా’ అని చెప్పా.
దాంతో సెట్‌లో పనిచేస్తున్న వారందరూ మీసాలుని తీశారు. ఇక లేడీ గెటప్‌లో మా కుటుంబసభ్యులు నన్ను చూడలేకపోయారు. ‘మీసాలు పెంచేవరకూ కళ్ల ముందు కనపడొద్దు అన్నారు’’ అంటూ ‘చంటబ్బాయి’ సంగతులను చిరంజీవి గుర్తుచేసుకున్నారు. జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి Chiru హీరోగా నటించిన కామెడీ డ్రామా ‘చంటబ్బాయి’. ఆయనకున్న మాస్ ఇమేజ్‌కు విభిన్నంగా చేసిన ఈ ప్రయత్నం చిరు కెరీర్‌లో కల్ట్ క్లాసిక్ చిత్రంగానూ నిలిచింది.