Ali : “ఫస్ట్ డే ఫస్ట్ షో” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆలీ స్పీచ్ కీ చిరంజీవి షాక్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 12 March 2023, 4:00 pm

Ali : తెలుగు చలనచిత్ర రంగంలో కమెడియన్ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో ఎవరి అండలేకుండా తన సొంత టాలెంట్ తో పైకి రావడం జరిగింది. తన కామెడీ టైమింగ్ తో పాటు అదిరిపోయే పంచ్ డైలాగులతో దాదాపు నాలుగు దశాబ్దాలు నుండి సినీ ప్రేక్షకులను ఆలీ అలరిస్తూ ఉన్నాడు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కీలకంగా రాణిస్తున్నారు. ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీలక నేతగా రాణిస్తూ మీడియా సలహాదారుడిగా పదవి అందుకోవటం జరిగింది. ఇదిలా ఉంటే గత ఏడాది “ఫస్ట్ డే ఫస్ట్ షో” సినిమా

Chiranjeevi Reaction To Ali Speech About Pawan Kalyan

Chiranjeevi Reaction To Ali Speech About Pawan Kalyan

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆలీ పాల్గొనడం తెలిసిందే. ఇదే కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ… సినిమా ఇండస్ట్రీలో ప్రారంభంలో తన అవకాశాల గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ క్రమంలో పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో తాను ఇంటి దగ్గర ఉన్న సమయంలో ఏడిద నాగేశ్వరరావు గారు నాకు తమిళ సినిమాలలో

Chiranjeevi Reaction To Ali Speech About Pawan Kalyan

Chiranjeevi Reaction To Ali Speech About Pawan Kalyan

అవకాశాలు వచ్చేలా దగ్గరుండి చూసుకున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులైతే నన్ను నాలుగో కొడుకుగా చూసుకున్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల ఆయన దయవల్ల ఇప్పటివరకు 1100 కు పైగా సినిమాలు చేయడం జరిగింది. 1100కు పైగా సినిమాలు అనేసరికి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన.. చిరంజీవి ఒక్కసారిగా షాక్ అయి చప్పట్లు కొట్టిన వీడియో లేటెస్ట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “ఫస్ట్ డే ఫస్ట్ షో” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో… ఆలీ స్పీచ్ వీడియో తాజాగా ట్రెండింగ్ అవుతుంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp