Chiranjeevi : గత కొద్ది రోజులుగా మెగా, అల్లు కుటుంబాల మధ్య గొడవలున్నట్టు నెట్టింట ప్రచారాలు జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే అందరి అనుమానాలకి తగ్గట్టు బన్నీ చేసే పనులు ఆ అనుమానాలని మరింత బలపరుస్తుంటాయి. చెప్పను బ్రదర్ అని చెప్పినప్పటి నుండి అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య ఏదో నడుస్తుందనే డిస్కషన్ ఉంది. ఇక కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైఎస్సార్సీపీ నంధ్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాల వెళ్లి అక్కడ ప్రజలని తన స్నేహితుడికి ఓటు వేయాల్సిందిగా అడిగారు. అయితే ఆ పర్యటన వివాదం కూడా అయింది. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఈ పర్యటన చేసినందుకు, అక్కడ అల్లు అర్జున్ ని చూడటానికి వందలాది మంది ప్రజలు వచినందువలన శాంతి భద్రలకు ఆటంకం కలిగింది అని అల్లు అర్జున్ పై ఒక కేసు కూడా నమోదు చేశారు.
అయితే అల్లు అర్జున్ పర్యటన చేసిన రోజే నంధ్యాల పర్యటనని బ్యాలన్స్ చెయ్యడానికే అన్నట్టుగా రామ్ చరణ్, సురేఖలతో అల్లు అరవింద్ పిఠాపురం వెళ్లారు.అల్లు అరవింద్ ఎంతగా బ్యాలన్స్ చేద్దామని అనుకున్నా, అల్లు అర్జున్ చేసిన పని మాత్రం మెగాస్టార్ కుటుంబంలో ఎవరికీ నచ్చలేదు అనేది చాలా క్లియర్ గా అర్థం అవుతోంది అనే విషయం బయటకి వచ్చింది. ఇక చిరంజీవి సోదరుడు నాగబాబు బన్నీని ఉద్దేశిస్తూ పరోక్షంగా ఒక ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే…! అని ఆ ట్వీట్ లో ఉంది. అల్లు అర్జున్ ను ఉద్దేశించే నాగబాబు ఆ ట్వీట్ చేశారని అందరికీ అర్థమైపోయింది. ఈ ట్వీట్ పై మెగా అభిమానులు మండిపడ్డారు. నాగబాబుకు నోటితొందర ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై చిరంజీవి సీరియస్ అయి నాగబాబుకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మన కుటుంబాన్ని వేలెత్తే విధంగా మనం సోషల్ మీడియాలో వైరల్ అవకూడదని, మన పరువును మనమే తీసుకోకూడదని, తిట్టుకున్నా, కొట్టుకున్నా మన కుటుంబం మనదేనని, ఒకరి దగ్గర చులకన కావొద్దు అంటూ హితబోధ చేశారట. మరో వైపు అల్లు అరవింద్ కూడా ఈ విషయంలో నాగబాబుని గట్టిగానే మందలించాడట . దీంతో నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్‌ని డియాక్టివేట్ చేసుకోవడం గమనార్హం…మొత్తానికి నాగబాబు తను చేసిన తప్పుని తెలుసుకొని క్షమాపణలు చెపపినట్టు నెట్టింట ఓ వార్త హల్‌చల్ చేస్తుంది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.