Chiranjeevi : మెగా కుటుంబంలో గొడవలు.. నాగ‌బాబుపై ఫుల్ సీరియ‌స్ అయిన చిరంజీవి..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Chiranjeevi : మెగా కుటుంబంలో గొడవలు.. నాగ‌బాబుపై ఫుల్ సీరియ‌స్ అయిన చిరంజీవి..!

Chiranjeevi  : గ‌త కొద్ది రోజులుగా మెగా, అల్లు కుటుంబాల మ‌ధ్య గొడ‌వ‌లున్న‌ట్టు నెట్టింట ప్ర‌చారాలు జ‌రుగుతూ ఉండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. అయితే అంద‌రి అనుమానాల‌కి త‌గ్గ‌ట్టు బ‌న్నీ చేసే ప‌నులు ఆ అనుమానాల‌ని మ‌రింత బ‌ల‌ప‌రుస్తుంటాయి. చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అని చెప్పిన‌ప్ప‌టి నుండి అల్లు, మెగా ఫ్యామిలీల మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌నే డిస్క‌ష‌న్ ఉంది. ఇక కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైఎస్సార్సీపీ నంధ్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 May 2024,1:30 pm

Chiranjeevi  : గ‌త కొద్ది రోజులుగా మెగా, అల్లు కుటుంబాల మ‌ధ్య గొడ‌వ‌లున్న‌ట్టు నెట్టింట ప్ర‌చారాలు జ‌రుగుతూ ఉండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. అయితే అంద‌రి అనుమానాల‌కి త‌గ్గ‌ట్టు బ‌న్నీ చేసే ప‌నులు ఆ అనుమానాల‌ని మ‌రింత బ‌ల‌ప‌రుస్తుంటాయి. చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అని చెప్పిన‌ప్ప‌టి నుండి అల్లు, మెగా ఫ్యామిలీల మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌నే డిస్క‌ష‌న్ ఉంది. ఇక కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైఎస్సార్సీపీ నంధ్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాల వెళ్లి అక్కడ ప్రజలని తన స్నేహితుడికి ఓటు వేయాల్సిందిగా అడిగారు. అయితే ఆ ప‌ర్య‌ట‌న వివాదం కూడా అయింది. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఈ పర్యటన చేసినందుకు, అక్కడ అల్లు అర్జున్ ని చూడటానికి వందలాది మంది ప్రజలు వచినందువలన శాంతి భద్రలకు ఆటంకం కలిగింది అని అల్లు అర్జున్ పై ఒక కేసు కూడా నమోదు చేశారు.

Chiranjeevi  నాగ‌బాబుపై సీరియస్

అయితే అల్లు అర్జున్ ప‌ర్య‌ట‌న చేసిన రోజే నంధ్యాల పర్యటనని బ్యాలన్స్ చెయ్యడానికే అన్నట్టుగా రామ్ చరణ్, సురేఖలతో అల్లు అరవింద్ పిఠాపురం వెళ్లారు.అల్లు అరవింద్ ఎంతగా బ్యాలన్స్ చేద్దామని అనుకున్నా, అల్లు అర్జున్ చేసిన పని మాత్రం మెగాస్టార్ కుటుంబంలో ఎవరికీ నచ్చలేదు అనేది చాలా క్లియర్ గా అర్థం అవుతోంది అనే విషయం బయటకి వచ్చింది. ఇక చిరంజీవి సోదరుడు నాగబాబు బన్నీని ఉద్దేశిస్తూ పరోక్షంగా ఒక ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే…! అని ఆ ట్వీట్ లో ఉంది. అల్లు అర్జున్ ను ఉద్దేశించే నాగబాబు ఆ ట్వీట్ చేశారని అందరికీ అర్థమైపోయింది. ఈ ట్వీట్ పై మెగా అభిమానులు మండిపడ్డారు. నాగబాబుకు నోటితొందర ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chiranjeevi మెగా కుటుంబంలో గొడవలు నాగ‌బాబుపై ఫుల్ సీరియ‌స్ అయిన చిరంజీవి

Chiranjeevi : మెగా కుటుంబంలో గొడవలు.. నాగ‌బాబుపై ఫుల్ సీరియ‌స్ అయిన చిరంజీవి..!

దీనిపై చిరంజీవి సీరియస్ అయి నాగబాబుకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మన కుటుంబాన్ని వేలెత్తే విధంగా మనం సోషల్ మీడియాలో వైరల్ అవకూడదని, మన పరువును మనమే తీసుకోకూడదని, తిట్టుకున్నా, కొట్టుకున్నా మన కుటుంబం మనదేనని, ఒకరి ద‌గ్గ‌ర చుల‌క‌న కావొద్దు అంటూ హిత‌బోధ చేశార‌ట‌. మ‌రో వైపు అల్లు అర‌వింద్ కూడా ఈ విష‌యంలో నాగ‌బాబుని గ‌ట్టిగానే మంద‌లించాడ‌ట . దీంతో నాగ‌బాబు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌ని డియాక్టివేట్ చేసుకోవడం గమనార్హం…మొత్తానికి నాగ‌బాబు త‌ను చేసిన త‌ప్పుని తెలుసుకొని క్ష‌మాప‌ణ‌లు చెప‌పిన‌ట్టు నెట్టింట ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది