Anasuya : అనసూయకి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి.. ఏ విషయంలోనో తెలుసా?
Anasuya: యాంకర్‌గా, నటిగా సత్తా చాటుతున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. ఈ అమ్మడు బుల్లితెరపై అందాలు ఒలికిస్తూనే వెండితెరపై తనలోని నటనని బయటకు తీస్తోంది. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. తనదైన నటనతో క్షణం, రంగస్థలంతో పాటు పలు చిత్రాలలో అలరించిన అనసూయ నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది.చిరజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో కూడా అనసూయ చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది.
అజ్ఞాతంలో ఉన్న ముఖ్యమంత్రి పెద్ద కుమారుడే గాడ్ ఫాదర్. సేవ కార్యక్రమాలు చేస్తూ పేదవారికి అండగా ఉండే పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. కీలక సమయంలో గాడ్ ఫాదర్ పరువు ప్రతిష్టలు మంటగలిపే కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో అనసూయ కీలకంగా ఉంటుంది. అందులో ఆమె ఓ ఛానెల్ ఓనర్ పాత్రలో కనిపించనుంది. రీసెంట్‌గానే ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు.అనసూయ పాత్ర పరంగా చూస్తే ఆమె నడిపే ఛానెల్ ఆర్థిక నష్టాల్లో ఉంటుంది. సమస్యను తీరుస్తామని చెప్పి చిరంజీవి ప్రత్యర్థులు అనసూయకి చెప్పి ఆమె రన్ చేసే ఛానెల్ ఫైనాన్సియల్ సమస్యను తీరుస్తామని చెప్పి,

chiranjeevi warns to anasuya
Anasuya : రీల్ సీన్..
చిరంజీవికి వ్యతిరేకంగా వార్తలు వేయించి జైలుకి వెళ్లేలా చేస్తారు. కానీ వారు తమ మాటను నిలుపుకోరు. జైలు నుంచి నిర్దోషిగా తిరిగి వచ్చిన చిరంజీవి పాత్రధారి అనసూయ భరద్వాజ్‌ను కలిసి ఆమె ఛానెల్‌కు సంబంధించిన ఆర్థిక సమస్యను తీరుస్తాడు. అందుకు తనో సాయం అడుగుతారు. ఆ సందర్భంలో అనసూయ పాత్రధారికి చిరంజీవి పాత్రధారి వార్నింగ్ కూడా ఇస్తాడట. ఇలా సినిమాలోనే అనసూయకి చిరు వార్నింగ్ ఇచ్చాడు తప్ప బయట కాదులేండి. మలయాళ చిత్రం లూసిఫర్‌కు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకుడు.