Vijay Devarakonda : పెళ్లి వార్తలు పుకార్లే.. అది చెప్పడానికి అంత పెద్ద బూతు వాడాలా విజయ్ దేవరకొండ ?
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా పెళ్లి చేసుకోబోతున్నారు.. ఈ ఏడాది చివర్లో వారి పెళ్లి ఉంటుంది అంటూ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. గత రెండు రోజులుగా ఈ వార్తలను ప్రముఖ మీడియా సంస్థలు కూడా కవర్ చేయడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. నిజంగానే వీరిద్దరు పెళ్లి చేసుకుంటారా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. వీరిద్దరి పెళ్లి గురించి వార్తలు రావడం ఇదే మొదటి సారి ఏమి కాదు. గతంలో కూడా పలు సార్లు ఇలాంటి వార్తలు వచ్చాయి. పలు వేదికలపై వీరు కలిసిన సందర్భాల్లో కూడా వీరు పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఈసారి ప్రచారం పిక్స్ కి చేరింది. ఎప్పటిలాగే మేమిద్దరం స్నేహితులం మాత్రమే.. మాకు లవ్ ఇంట్రెస్ట్ లేదు అంటూ విజయ్ దేవరకొండ క్లారిటీ ఇస్తే సరిపోయేది కానీ ఈ సారి కాస్త సీరియస్ గా ఆయన పుకార్లను ఖండించడం జరిగింది.
పుకార్లను ఖండిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక విధంగా ఆయనని విమర్శల పాలు చేసింది అనడంలో సందేహం లేదు. స్టార్ హీరో అయినా విజయ్ దేవరకొండ బూతులు మాట్లాడుతూ అది కూడా బి గ్రేడ్ బూతులు మాట్లాడుతూ ట్వీట్ చేయడం ఆయన అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. ఆయన అభిమానుల్లో ఎక్కువ శాతం మంది అమ్మాయిలు ఉంటారు. ఆ అమ్మాయిలు ఎక్కువగా ఇలాంటి భూతులను ఇష్టపడరు. రాయలేని పదాలతో ఆయన బూతులు మాట్లాడటం కాస్త ఇబ్బందిగానే ఉంది. ఆయన తీరు ఇప్పటికైనా మారుతుంది అని అంతా భావించారు కానీ ఇంకా అర్జున్ రెడ్డి ట్రాన్స్ లోనే ఆయన ఉన్నట్లుగా అనిపిస్తుంది అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

clarification on vijay devarakonda and rashmika mandanna love marriage
విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ షూటింగ్ ని పూర్తి చేశాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న వెంటనే జనగణమన సినిమా మొదలు పెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు పూరీ. ఆ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయి. అధికారిక ప్రకటన ఈ సమ్మర్ లో రాబోతుంది. సినిమా ఆగస్టులో విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. సినిమాకు డిజిటల్ ఆఫర్లు భారీగా వస్తున్నాయని ప్రచారం జరిగింది. కానీ థియేటర్ రిలీజ్ ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. లైగర్ లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించిన విషయం తెల్సిందే. ఇక రష్మిక మందన్నా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతుంది.