Mohan Babu – Chandra Mohan : చంద్రమోహన్ కి , మోహన్ బాబు కి మధ్య గొడవ .. అందుకే చూడటానికి కూడా రాలేదు..!!

Authored By aruna | The Telugu News | Published on: November 14, 2023, 1:23 pm

Mohan Babu – Chandra Mohan : సినీ ఇండస్ట్రీలో చంద్రమోహన్ కి నటుడిగా మంచి గుర్తింపు ఉంది. ఈయన సినిమాలు మొదట్లో చాలా హిట్ అయ్యాయి. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. చాలామంది స్టార్ హీరోలతో చంద్రమోహన్ సన్నిహితంగా ఉండేవారు. ఈయనతో సినిమాలు చేయడానికి చాలామంది హీరోయిన్లు ఆసక్తి చూపించేవారు. ఎందుకంటే ఈయనతో సినిమాలు చేస్తే ఆ హీరోయిన్ల లక్కు మారుతుందని అంటుంటారు. ఇలాంటి క్రమంలోనే అప్పుడే హీరోగా ఎంట్రీ ఇస్తున్న మోహన్ బాబు కి చంద్రమోహన్ కి మధ్య చిన్న గొడవ జరిగింది.

చంద్రమోహన్ చేయాల్సిన సినిమా ఒకటి మోహన్ బాబు చేస్తున్నాడు అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మోహన్ బాబును ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో మోహన్ బాబు కూడా చంద్రమోహనంపై సీరియస్ అయినట్లు చాలా వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఇద్దరూ కలుసుకున్నారు. వీరిద్దరూ కలిసి చాలా సినిమాలలో నటించడం జరిగింది. మోహన్ బాబు కి కొంచెం కోపం ఎక్కువగా ఉండటం వలన మిగతా హీరోలతో కూడా కొంచెం దురుసుగా ప్రవర్తిస్తూ ఉండేవారు. ఈ కారణంగానే చంద్రమోహన్ మోహన్ బాబు మధ్య అప్పట్లో చిన్న గొడవ జరిగిందని వార్తలు వచ్చాయి.

అయినా కానీ కొద్దిరోజుల తర్వాత వీరిద్దరూ కలిశారు. చాలా సినిమాలలో నటించారు. చంద్రమోహన్ రీసెంట్ గా మరణించడం జరిగింది. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఈయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇక చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం జరిగాయి. ఫిలింనగర్ లోని చంద్రమోహన్ నివాస స్థలం నుంచి పంజాగుట్ట స్మశాన వాటిక వరకు చంద్ర మోహన్ అంతిమ యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు.

Also read

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp