Allu Arjun : అల్లు అర్జున్‌కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కేసీఆర్.. నో ఎమ్మెల్యే టికెట్
Allu Arjun : ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఒకటే వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల గురించే చర్చ. ఒకేసారి మీడియా ముఖంగా సీఎం కేసీఆర్ 115 ఎమ్మెల్యే టికెట్లను ప్రకటించారు. దీంతో ప్రతిపక్షాలు అబ్బా అన్నంత పని చేశాయి. ఒక 4 నియోజకవర్గాలకే ఇంకా టికెట్లు కేటాయించలేదు. అయితే.. ఈసారి ప్రకటించిన సీట్లలో కొందరు ఎమ్మెల్యేలకు కేసీఆర్ షాకిచ్చారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు షాకిచ్చారు కేసీఆర్.
ఆ తర్వాత కామారెడ్డి నుంచి తానే స్వయంగా పోటీ చేస్తున్నారు కేసీఆర్. జనగామ ఎమ్మెల్యే టికెట్ ను ఇంకా కన్ఫమ్ చేయలేదు. ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చారు. ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చారు. ఇలా.. పలువురు ఎమ్మెల్యేలకు షాకిచ్చిన కేసీఆర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా ఒకవిధంగా షాక్ ఇచ్చారనే చెప్పుకోవాలి. అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు, అల్లు అర్జున్ కు ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది తిరకాసు.అల్లు అర్జున్ మామ, స్నేహారెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ నాయకుడు అని తెలుసు కదా. పెద్దఊర మండలం చింతపల్లికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి 2014 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
Allu Arjun : అల్లు అర్జున్ మామకు టికెట్ ఇవ్వని కేసీఆర్
కానీ.. మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతుల్లో ఓడిపోయారు. ఈసారి మాత్రం నాగార్జునసాగర్ నుంచి బరిలోకి దిగాలని ముందు నుంచి ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. తన అల్లుడు అల్లు అర్జున్ ని కూడా దింపాడు. దీని ద్వారా తనకు సినీ గ్లామర్ కూడా ఉందని పార్టీ అధినాయకత్వానికి తెలిసేలా చేశారు. తన స్వగ్రామానికి కంచర్ల కన్వెన్షన్ పేరుతో నిర్మించిన ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ ను పిలిపించి హడావుడి చేశారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తన తరుపున ప్రచారం చేస్తారని భావించారు. కానీ.. ఇప్పటికే కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ల లిస్ట్ ప్రకటించారు. కానీ.. నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి నోముల భగత్ కే టికెట్ కేటాయించారు కేసీఆర్. దీంతో కంచర్ల అసంతృప్తికి లోనయినట్టు తెలుస్తోంది.