YS Jagan : వైకాపా లో వైఎస్ జగన్ ఒక్కడిదే ఆధిపత్యం అనేవారికి ఇదే సమాధానం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : వైకాపా లో వైఎస్ జగన్ ఒక్కడిదే ఆధిపత్యం అనేవారికి ఇదే సమాధానం

YS Jagan ; ఏపీ అధికార పార్టీ వైకాపా గురించి ప్రతిపక్ష పార్టీలు పదే పదే మాట్లాడుతూ ఆ పార్టీ లో అధినేత జగన్‌ ఒక్కడిదే ఆదిపత్యం.. ఇతరులు ఏ ఒక్కరు కూడా కనీసం నిర్ణయాలు తీసుకోలేరు అంటూ ప్రచారం ఉంది. కాని అది ఏమాత్రం నిజం కాదు. పార్టీలో నిర్ణయాలు అయినా ప్రభుత్వం లో నిర్ణయాలు అయినా కూడా పూర్తిగా చర్చించిన తర్వాతే జగన్ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులతో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :3 July 2022,7:40 am

YS Jagan ; ఏపీ అధికార పార్టీ వైకాపా గురించి ప్రతిపక్ష పార్టీలు పదే పదే మాట్లాడుతూ ఆ పార్టీ లో అధినేత జగన్‌ ఒక్కడిదే ఆదిపత్యం.. ఇతరులు ఏ ఒక్కరు కూడా కనీసం నిర్ణయాలు తీసుకోలేరు అంటూ ప్రచారం ఉంది. కాని అది ఏమాత్రం నిజం కాదు. పార్టీలో నిర్ణయాలు అయినా ప్రభుత్వం లో నిర్ణయాలు అయినా కూడా పూర్తిగా చర్చించిన తర్వాతే జగన్ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులతో చర్చలు జరిపిన తర్వాత మాత్రమే పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది అనేది తాజాగా మరోసారి క్లారిటీ వచ్చింది.

తెలుగు దేశం పార్టీతో పాటు ఏ ఇతర ప్రాంతీయ పార్టీలు అయినా కూడా ఒక నియోజక వర్గం యొక్క అసెంబ్లీ స్థానం లో పోటీ చేయబోతున్నది ఎవరు చెప్పరు. కాని తాజాగా కొడాలి నాని మాట్లాడుతూ గన్నవరం అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా వంశీ పైడిపల్లి పోటీ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఒక అధికార ప్రాంతీయ పార్టీ లో ఇలా జరగడం చాలా అరుదుగా జరుగుతుంది. సీఎం జగన్‌ మోహన్ రెడ్డి పార్టీ విషయం లో ఇతర నాయకులకు ఎంతగా ప్రాముఖ్యత ఇస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

YS Jagan ysrcp leaders have full freedom in the party

YS Jagan ysrcp leaders have full freedom in the party

జిల్లా కు చెందిన ముఖ్య నాయకులకు అభ్యర్థుల ఎంపిక మొదలుకుని ప్రతి విషయం లో కూడా స్వేచ్చ ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి ఉంది అనేది చాలా మంది అభిప్రాయం. వైకాపా లో జగన్‌ ఒక్కడిదే ఆధిపత్యం అనే వారికి ఇదే సమాధానం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అధికార పార్టీ వైకాపా లో కీలక నాయకుల నిర్ణయాలకు తగ్గట్లుగానే జగన్‌ ఫాలో అవుతున్నారు. ప్రభుత్వంలో అయినా పార్టీ లో అయినా కూడా ప్రతి ఒక్కరి నిర్ణయాన్ని తీసుకున్న తర్వాతే జగన్ తుది నిర్ణయం తీసుకుంటారు తప్ప.. ఆధిపత్యం ధోరణితో వ్యవహరించారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది