Rohini : నాకు పెళ్లి కాదా, సర్జరీ చేయించుకున్నాను.. చెప్పు తీసుకొని కొట్టేదాన్ని అంటూ రోహిణి ఫైర్..!
Rohini : బుల్లితెర నటి రోహిణి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటూ నవ్వించేస్తోంది. రీసెంట్‌గా సేవ్ ది టైగర్స్ రెండో సీజన్‌లో అదరగొట్టేసింది. ఇక సినిమాల్లో ఇప్పుడిప్పుడే మంచి పాత్రలను దక్కించుకుంటోంది. లేడీ కమెడియన్లు లేని లోటుని రోహిణి భర్తీ చేస్తోంది.. సిల్వర్ స్క్రీన్ పై కూడా రోహిణి రాణిస్తుంది. బలగం వంటి బ్లాక్ బస్టర్ మూవీలో ఓ కామెడీ రోల్ చేసింది. వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ లో రోహిణి పాత్ర చాలా హిలేరియస్ గా ఉంటుంది. కాగా ఇటీవల రోహిణి వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఆ వీడియోలో రోహిణి ని పోలీసులు అరెస్ట్ చేశారు. రోహిణి ఓ రేవ్ పార్టీలో పాల్గొన్న నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
నాకేమి తెలియదు. నేను డ్రగ్స్ తీసుకోలేదు. ఎన్నారై బర్త్ డే పార్టీ అంటే వచ్చానని… ఆ వీడియోలో రోహిణి బ్రతిమిలాడుకున్నారు. రోహిణి అరెస్ట్ పై ఎలాంటి న్యూస్ లేదు. దీంతో రోహిణి ఫ్రాంక్ చేశారని అందరికీ క్లారిటీ వచ్చింది. బర్త్ డే బాయ్ అనే ఓ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రోహిణి రేవ్ పార్టీకి హాజరై అరెస్ట్ అయినట్లు ఫేక్ వీడియో చేసింది. అయితే ఈ వీడియో నిజమే అంటూ ఓ సీనియర్ జర్నలిస్ట్ కామెంట్స్ చేసిన తరుణంలో రోహిణి స్పందించారు. ఒకింత ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. రోహిణి ఇంస్టాగ్రామ్ వేదికగా వీడియో బైట్ వదిలింది. నేను ఇటీవల బర్త్ డే బాయ్ మూవీ ప్రమోషన్స్ కోసం రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ఫ్రాంక్ వీడియో చేశాను.
Rohini : నాకు పెళ్లి కాదా, సర్జరీ చేయించుకున్నాను.. చెప్పు తీసుకొని కొట్టేదాన్ని అంటూ రోహిణి ఫైర్..!
అది ఫేక్ వీడియో అని మీడియా వాళ్ళు గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే సీనియర్ జర్నలిస్ట్ హనుమంతరావు చేసిన కామెంట్స్ ఇబ్బంది పెట్టాయి. నిప్పు లేనిదే పొగరాదు అంటారు. ఆమె డ్రగ్స్ తీసుకునే ఉంటుంది. అందుకే పోలీసులు పట్టుకున్నారని అంటారా? మీరు పర్సనల్ గా కూడా నా మీద అటాక్ చేశారు. ఆమెకు సర్జరీ జరగడం వలన బరువు పెరిగింది. పెళ్లి కూడా చేసుకునే ఆలోచన లేదేమో అన్నారు. లావుగా ఉన్నోళ్లకు పెళ్లిళ్లు కావా? పెళ్లి చేసుకోకూడదా?. మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకొకరిని అయితే చెప్పుతో కొట్టేదాన్ని. నాకు మందు అలవాటు కూడా లేదు. సినిమాల్లో చేసినవన్నీ నిజ జీవితంలో చేస్తారా? సీనియర్ జర్నలిస్ట్ గా ఒక సంఘటన జరిగితే… అది నిజమా? అబద్దమా? అని తెలుసుకుని మాట్లాడాలి. మీకు పనిలేక పోతే, ఖాళీగా ఉంటే ఇంట్లో కూర్చోండి. ఇలాంటి కామెంట్స్ చేయకండి… అంటూ రోహిణి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.