Costumes Krishna : ఈరోజే చనిపోయిన కాస్ట్యూమ్స్ కృష్ణ.. ఆయన గురించి ఈ జనరేషన్ కి తెలియని సంచలన నిజాలు !
Costumes Krishna : ప్రముఖ నటుడు నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ చెన్నైలో ఆయన స్వగృహంలో ఈరోజు తుది శ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు మాదాసు కృష్ణ స్వస్థలం విశాఖపట్నం. అయితే తెలుగులో ఎన్నో సినిమాలకు ఆయన కాస్ట్యూమ్స్ అందించారు. ఆయన మొదటగా సురేష్ ప్రొడక్షన్ సంస్థలో ఎక్కువ రోజులు పనిచేశారు. అందుకే ఆయనను అందరూ సురేష్ కృష్ణ అని పిలిచేవారు. ఆ తర్వాత కాస్ట్యూమ్స్ కృష్ణ గా పేరు పడింది. ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో భారత్ బంద్ సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆయన ఉండే ఇంటిపైన కోడి రామకృష్ణ ఉండేవారు.
ఆయనే పిలిచి భారత్ బంద్ సినిమా కోసం మూడు రోజులు వేషం వేయమని అడగడంతో కృష్ణ అయిష్టంగానే ఓకే చెప్పారు. ఈ సినిమాలో ఆయన పాత్రకు మంచి పేరు రావడంతో వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి. పెళ్ళాం చెపితే వినాలి, పోలీస్ లాకప్, దేవుళ్ళు, మా ఆయన బంగారం, అల్లరి మొగుడు, విలన్, పుట్టింటికి రా చెల్లి వంటి సినిమాలలో నటించారు. నిర్మాతగాను ఎన్నో సినిమాలు తీశారు. సూపర్ స్టార్ కృష్ణ అశ్వద్ధామ సినిమాకు ఆయనే నిర్మాత. ఆయన నిర్మించిన ఓ సినిమా రైట్స్ ను దిల్ రాజు 36 లక్షలకు కొన్నారు. ముందు 34 లక్షలు ఇచ్చారు.
సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో డబ్బులు రాలేదు. నాలుగు రోజుల్లో రాజు మిగిలిన రెండు లక్షల కూడా తీసుకువెళ్లి ఇవ్వడంతో కృష్ణ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆయన నిర్మించిన పెళ్లి పందిరి సినిమా రైట్స్ కోసం చాలామంది పోటీపడిన కృష్ణ పట్టుబట్టి మరీ రాజుకే ఇచ్చారు. తాను డిస్ట్రిబ్యూషన్ ఆపేశానని, ఆఫీస్ క్లోజ్ చేసానని చెప్పిన కూడా కృష్ణ అడ్వాన్స్ తీసుకోకుండా రాజుకు ఆ సినిమా రైట్స్ ఇచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అక్కడి నుంచి దిల్ రాజు నిర్మాతగా సక్సెస్ అయ్యారు. అలా కాస్ట్యూమ్స్ కృష్ణ చేసిన సాయం వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని దిల్ రాజు చాలాసార్లు చెప్పుకొచ్చారు.