Daddy Movie Child Artist : త్వరలో హీరోయిన్ కాబోతున్న .. డాడీ సినిమాలో చిన్నారి ..!

 Authored By prabhas | The Telugu News | Updated on :24 December 2022,4:00 pm

Daddy Movie Child Artist : ఇప్పటికీ డాడీ సినిమా వస్తే చాలామంది ఎంతో ఇష్టంగా చూస్తారు. డాడీ పాత్రలో చిరంజీవి తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో అందరికీ తెలిసేలా అద్భుతంగా నటించారు. ఇక కూతురి పాత్రలో నటించిన చిన్నారి కూడా ఎంతో అద్భుతంగా నటించింది. ఈ సినిమాను డైరెక్టర్ సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా సిమ్రాన్ నటించింది. అలాగే ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, ఎమ్ ఎస్ నారాయణ, అల్లు అర్జున్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా చేశారు. ఈ సినిమాలో

చిరంజీవి కూతురిగా అక్షయపాత్రలో నటించిన చిన్నారికి కూడా మంచి గుర్తింపు వచ్చింది.ఆ చిన్నారి అసలు పేరు అనుష్క మల్హోత్ర. ముంబైకి చెందిన అనుష్క తెలుగు పరిశ్రమలో తెలిసిన వారి ద్వారా డాడీ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో అనుష్క మల్హోత్ర పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందాయి. ఆ తర్వాత చిన్నారికి బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ చదువుకి ఆటంకం కలుగుతుందని ఆమె తల్లిదండ్రులు అనుష్కను సినిమాలకు దూరంగా ఉంచారు. దీంతో సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది అనుష్క.

Daddy Movie Child Artist Anushka Malhotra latest pics

Daddy Movie Child Artist Anushka Malhotra latest pics

ప్రస్తుతం అనుష్క మల్హోత్రా డిగ్రీ పూర్తి చేసుకుంది. ఇప్పుడు మోడలింగ్ రంగంలో దిగినట్లు సమాచారం. అయితే తాజాగా అనుష్క కన్నడ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న సినిమాలో హీరోయిన్గా నటించే ఛాన్స్ దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. త్వరలో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఫోటోలు బయటికి వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు డాడీ సినిమాలో చిన్నారి పాప ఇప్పుడు ఎంత అందంగా ఉందో అని కామెంట్స్ చేస్తున్నారు.

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి