Daku maharaaj : డాకు మహరాజ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం.. ఎంత కలెక్షన్ వచ్చాయంటే..!
Daku maharaaj : సంక్రాంతి బరిలో బాలయ్య మూవీ ఉంటే..బాక్సాఫీస్ దగ్గర కనిపించే ఆ కిక్కే వేరు. గత ఏడాది బాలకృష్ణ మూవీ ఒక్కటి కూడా రిలీజ్‌కాకపోవడంతో..మంచి ఆకలిమీద ఉన్నారు ఎన్‌బీకే ఫ్యాన్స్. దీంతో ఈ పండగకు ‘డాకు మహారాజ్’గా Daku maharaaj 1st day collection ప్రేక్షకులను అలరించడానికి వచ్చారు బాలకృష్ణ.అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టి మంచి ఊపులో ఉన్నాడు బాలయ్య. ఆయనకి అదే రేంజ్‌లో సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) జత కలవడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.
Daku maharaaj హిట్ కలెక్షన్స్..
ఇందులో నందమూరి బాలకృష్ణ Balakrishna సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్ , చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్ , హిమజ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్న డాకు మహారాజ్ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ. 25 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే యూఎస్‌లో అప్పుడే 1 మిలియన్ క్లబ్‌లోకి అడుగుపెట్టాడు బాలయ్య.
ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ , స్పెషల్ కారణంగా బుకింగ్స్‌లో ఎక్సలెంట్ హోల్డ్ చూపించింది. దాంతో అంతవరకే కలెక్షన్స్ వసూల్ చేసిందనే టాక్ వినిపిస్తుంది.ఇకపోతే బాలయ్య ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరోసారి సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే అఖండ 2 మూవీ షూటింగ్ అప్డేట్ రాబోతుందని సమాచారం..