Sankranthi : సంక్రాంతి సినిమాలు వంద కోట్ల హంగామా.. ఎన్ని రోజుల‌లో వ‌చ్చాయంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sankranthi : సంక్రాంతి సినిమాలు వంద కోట్ల హంగామా.. ఎన్ని రోజుల‌లో వ‌చ్చాయంటే..?

 Authored By ramesh | The Telugu News | Updated on :17 January 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Sankranthi : సంక్రాంతి సినిమాలు వంద కోట్ల హంగామా.. ఒకటి రెండు రోజుల్లో మరోటి 3 రోజుల్లో.. 4 రోజుల్లో..!

Sankranthi : సంక్రాంతి సినిమాల హంగామా తెలిసిందే. సంక్రాంతికి నాలుగు రోజులు ముందే వచ్చిన రాం చరణ్ గేం ఛేంజర్  Game Changer అంచనాలను అందుకోలేదు. బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా మాస్ మూవీగా ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ అనేలా ఉంది. ఇక వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం sankranthiki vasthunam సినిమా మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వెంకటేష్ సినిమా చూసేందుకు వస్తున్నారు. అందుకే ఆ సినిమా చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పెడుతున్నారు.

Sankranthi సంక్రాంతి సినిమాలు వంద కోట్ల హంగామా ఒకటి రెండు రోజుల్లో మరోటి 3 రోజుల్లో 4 రోజుల్లో

Sankranthi : సంక్రాంతి సినిమాలు వంద కోట్ల హంగామా.. ఒకటి రెండు రోజుల్లో మరోటి 3 రోజుల్లో.. 4 రోజుల్లో..!

ఐతే సంక్రాంతికి రిలీజైన 3 సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే వసూళ్లు తెస్తున్నాయి. ముఖ్యంగా 3 సినిమాలు కూడా 100 కోట్లు కొల్లగొట్టాయి. గేం ఛేంజర్ సినిమా 2 రోజుల్లో 100 కోట్లు తీసుకు రాగా.. సంక్రాంతికి వస్తున్నాం 3 రోజుల్లో 106 కోట్లు తెచ్చింది. డాకు మహారాజ్ 4 రోజుల్లో 100 కోట్లు క్రాస్ చేసింది. ఇలా సంక్రాంతికి రిలీజైన 3 సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరి అదరగొట్టాయి.

Sankranthi : ఫ్యామిలీ అంతా కలిసి చూసే..

సంక్రాంతి తెలుగు సినిమాల sankranthiki vasthunam బిజినెస్ బాక్సాఫీస్ కళకళలాడుతుంది. దాదాపు 500 కోట్ల దాకా పండగ 3 రోజుల్లో జరిగినట్టు తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా 3 రోజుల్లో 106 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఫుల్ రన్ లో 200 కోట్లు పైన సాధించే ఛాన్స్ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూసే మంచి ఎంటర్టైనర్ గా వచ్చింది. సినిమా చూసిన ఆడియన్స్ అంతా కూడా సూపర్ అనేస్తున్నారు.

సో సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ ఇలా 100 కోట్లతో అదరగొట్టడం ఆ హీరో ఫ్యాన్స్ ని అలరిస్తుంది. మొత్తానికి సంక్రాంతికి బాక్సాఫీస్ ఫైట్ లో అన్ని వర్గాల ఆడియన్స్ ఖుషి ఔతుండగా ఫైనల్ విన్నర్ గా విక్టరీ వెంకటేష్ నిలిచారని చెప్పొచ్చు. పండగ హాలీడేస్ పూర్తైనా మరో రెండు రోజులు సంక్రాంతికి వస్తున్నాం వసూళ్లు అదిరిపోయే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. Sankranthi, Movies, 100 Crores Club, Venkatesh, Ram Charan, Balakrishna

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది