pavitra poori : హీరోయిన్‌గా పూరి జగన్నాథ్ కూతురు.. ఆ పిక్స్ అందుకోసమేనా..?
pavitra poori : టాలీవుడ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంట.. ఆయన తీసిన సినిమాలే ‘పూరి’ గొప్పతనం గురించి మాట్లాడుతుంటాయి. మూవీస్‌ను చాలా ఫాస్ట్ అండ్ డైనమిక్‌గా తీయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవచ్చు. ఇయన్ను ఇండస్ట్రీలో బాగా కావాల్సిన వాళ్లు ‘జగన్’ అని పిలుస్తుంటారు. పూరి తన కెరీర్ ప్రారంభంలో వివాదాస్పద డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేసిన విషయం తెలిసిదే. ఆ తర్వాత తన టాలెంట్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ దర్శకులలో ఒకరిగా పేరొందారు. చాలా తక్కువ టైంలో బ్లాక్ బాస్టర్ తీయడం ఇండస్ట్రీలో పూరి తప్పా మిగతా వారెవ్వరి వలన కాదని స్టార్ దర్శకులు సైతం అంగీకరించారు.
పూరి జగన్నాథ్ చాలా కష్టపడి పైకి వచ్చారు. అంతేకాకుండా ఎంతో మంది హీరోహీరోయిన్స్‌కు లైఫ్ ఇచ్చారు. ప్లాపుల్లో ఉన్నవారిని సెక్సెస్ బాటలోకి తీసుకొచ్చారు. చాలా మంది కొత్త హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాకుండా వారి కెరీర్‌కు మార్గదర్శకుడయ్యాడని ఇండస్ట్రీలో టాక్. ఇకపోతే సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రభాస్, రవితేజ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నాగార్జున, అల్లు అర్జున్ లాంటి వారిలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. అప్పటివరకు మూస ధోరణిలో ఉన్న వీరి యాక్టింగ్ స్కిల్స్, టైమింగ్‌ను వెండి తెరపై కొత్త చూపించి సక్సెస్ అయ్యారు పూరి..

daughter of puri jagannath as the heroine
pavitra poori : పూరి జగన్నాథ్ కూతురు
ఇకపోతే పూరికి కూతురు, కొడుకు ఉన్నారు. తనయుడు ఆకాశ్ ఇప్పటికే ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ‘మహబూబా’, ‘రొమాంటిక్’ వంటి సినిమాల్లో హీరోగా చేశాడు. మహబూబా మూవీని స్వయంగా పూరి డైరెక్ట్ చేయగా అది ప్లాప్ అయ్యింది. ఈ మధ్య వచ్చిన ‘రొమాంటిక్’ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్న కమర్షియల్ హిట్ అందుకుంది. అయితే, పూరి కూతురు కూడా ‘పవిత్ర’ కూడా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే సోషల్ మీడియాలో రెగ్యూలర్‌గా ఫోటోస్ పోస్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, పిల్లల ఇష్టాలను ఎప్పుడు అడ్డు చెప్పనని పూరి గతంలోనే ప్రకటించారు.