Deepika Pilli : అందరికీ ఇవ్వనందుకు నన్ను క్షమించండి.. దీపిక పిల్లి ఎమోషనల్ పోస్ట్
Deepika Pilli : టిక్ టాక్ భామగా దీపిక పిల్లికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. టిక్ టాక్ ఊపు ఊపేసిన కాలంలో దీపిక పిల్లి వంటి కొంత మంది అమ్మాయిలు డ్యాన్స్ వీడియో, డైలాగ్ వీడియోలతో రెచ్చిపోయారు. ఒక్కొక్కరు తమ తమ పైత్యాలను ప్రదర్శించారు. అయితే టిక్ టాక్ బ్యాన్ అవ్వడంతో అలాంటి వారంతా దిక్కుతోచక బిక్కు బిక్కుమన్నారు. అందులో కొంత మందికి బుల్లితెరపై,వెండితెరపై అవకాశాలు వచ్చాయి.అలా దీపిక పిల్లికి బుల్లితెరపై మంచి అవకాశం వచ్చింది. వర్షిణి స్థానంలో ఢీ షోలో దీపిక పిల్లి వచ్చింది.
అయితే వర్షిణి వాడుకున్నంతగా ఢీ షోను దీపిక వాడుకోలేకపోయింది. దీపిక పిల్లి అసలు ఉందా? లేదా? అనే అనుమానం వచ్చేసింది. దీపిక పిల్లికి మాత్రం ఢీ షో ద్వారా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఢీ షోకి కూడా దీపిక పిల్లి వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయింది. అందుకే ఆ తదుపరి సీజన్‌కు ఆమెను పక్కన పెట్టేశారు.కానీ ఢీ షోలోకి రావడంతో యాంకర్ రష్మీతో దీపికి పిల్లి స్నేహ బంధం ఏర్పడింది. మొత్తానికి అక్కాచెల్లెళ్లుగా దీపిక, రష్మీ కలిసిపోయారు. పిల్లి చెల్లి అంటూ రష్మీ ఎంతో ప్రేమగా దీపికను చూసుకుంటుంది.

Deepika Pilli About Her Birthday Wishes
ఈ ఇద్దరూ కలిసి పార్టీలు, పబ్బులు అంటూ వీకెండ్‌లో తిరుగుతుంటారు. తాజాగా దీపిక పిల్లి తన బర్త్ డే మీద స్పందించింది. తనకు విషెస్ అందించిన వారికి థ్యాంక్స్ చెబుతూ సారీ కూడా చెప్పుకుంటూ వచ్చింది.హేయ్.. మై లవ్స్.. నాకు విషెస్ చెప్పిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్.. నాకు వీలైనంత వరకు అందరికీ రిప్లై ఇచ్చుకుంటూ వచ్చాను. కానీ అందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను. నన్ను క్షమించండి.. మీ వల్లే నా రోజంతా ఎంతో సంతోషంగా మారింది.. థ్యాంక్యూ సో మచ్.. మీ అందరికీ హగ్స్ అండ్ కిస్సెస్ అని దీపిక పిల్లి చెప్పుకొచ్చింది.

Deepika Pilli About Her Birthday Wishes