Hyper Aadi : నా రూంకి రా.. డైరెక్ట్‌గా దీపిక పిల్లిని అడిగేసిన హైపర్ ఆది

Authored By aruna | The Telugu News | Published on: August 12, 2023, 1:00 pm

Hyper Aadi : బుల్లితెరపై హైపర్ ఆది తిరుగులేని కమెడియన్‌గా, స్టార్ రైటర్‌గా దూసుకుపోతోన్నాడు. బుల్లితెరపై మాత్రం నిజంగానే ఆది రారాజులా ఉంటాడు. వెండితెరపై ఇంకా సరైన పాత్ర పడలేదు. ఆది సత్తాను చాటుకునే కారెక్టర్ రాలేదు. వెండితెరపై ఎన్ని పాత్రలు చేస్తున్నా.. ఎంత మంది స్టార్ హీరోల పక్కన చేస్తున్నా.. ఎన్ని కారెక్టర్లు వేస్తున్నా కూడా బుల్లితెరను మాత్రం వదిలిపెట్టడు. బుల్లితెరకు సరైన టైంను కేటాయిస్తూనే ఉంటాడు. బుల్లితెరే ఆదికి ఆరో ప్రాణంలా మారింది.

బుల్లితెరపై ప్రస్తుతం ఆది ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీలంటూ బిజీగా ఉన్నాడు. జబర్దస్త్ షోను వదిలేశాడు. టైం సరిపోవడం లేదని ఆ షోకు గ్యాప్ ఇచ్చాడు. ఇప్పటి వరకు మళ్లీ ఎంట్రీ ఇవ్వలేదు. ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీలతోనే బిజీగా ఉంటున్నాడు. అక్కడే ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ఢీ ప్రోమోలో ఆది దుమ్ముదులిపేశాడు. కింగ్ సినిమాలో జయసూర్యలా నటించాడు. బ్రహ్మానందంను ఇమిటేట్ చేశాడు. కాపీ ట్యూన్లు కొట్టి దొరికిపోతాడు. భోళా ప్రమోషన్స్ కోసం వచ్చిన మెహర్ కూడా ఆది మీద కౌంటర్లు వేస్తాడు.

Hyper Aadi Satires on Deepika Pilli in Dhee Premier League Latest Promo

Hyper Aadi Satires on Deepika Pilli in Dhee Premier League Latest Promo

ఇక సింగింగ్ ప్రోగ్రాంగా జడ్జ్ జయ సూర్యలా ఆది రెచ్చిపోతాడు. దీపిక పిల్లి దారుణంగా పాట పాడుతుంది. నువ్ ఎంచుకున్న రాగం ఏంటి.. పాడుతున్న రాగం ఏంటి.. తకిట 2 4 తకిటి 3 4 అంటూ ఇలా ఏదేదో అనేస్తాడు. నీ రూంలో ఉండే నువ్వు.. నా రూంలో ఉండలేవా? అంటూ అందరి ముందే నా రూంకి రాన్నట్టుగా హింట్ ఇచ్చాడు ఆది. మొత్తానికి ఆది కామెడీనే ఢీ షోకు హైలెట్ అవుతోంది. ఢీ షోలో డ్యాన్సుల కన్నా ఆది పంచులే హైలెట్ అవుతుంటాయని అందరికీ తెలిసిందే.ఈ మధ్య ఆది నెట్టింట్లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాడు. గత వారం భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆది ఇచ్చిన స్పీచ్ ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp