Deepika Pilli : నేను అలాంటిదాన్నే.. దీపిక పిల్లి మామూల్ది కాదు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 16, 2022, 11:00 am

Deepika Pilli : దీపిక పిల్లికి రోజురోజుకూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం టిక్ టాక్ వరకు పరిమితమైన ఈ భామ.. మెల్లిమెల్లిగా బుల్లితెరపై తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకుంటోంది. మొదట్లో ఢీ షోలో కనిపించింది దీపిక పిల్లి. ఆ షోలో ఉన్నంత కాలం ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆమె ఆ షోలో ఉన్నట్టు కూడా ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. హైపర్ ఆదితో ట్రాక్ నడిపించాలనే బాగానే ప్రయత్నించారు. కానీ ఆది దీపిక ట్రాక్ వర్కవుట్ అవ్వలేదు.

మొత్తానికి ఢీ నుంచి దీపికను ఆ తరువాతి సీజన్‌కు తీసేశారు. వేరే గ్యాంగుని పెట్టేసుకున్నారు. ఇక దీపిక పిల్లి ఢీ షోవల్ల ఒరిగిందేమీ లేదు. రష్మితో స్నేహం మాత్రం దొరికింది. ఢీ షోలో దీపిక లేకపోయినా.. రష్మీతో మాత్రం ఇంకా అదే స్నేహాన్ని కొనసాగిస్తోంది దీపిక పిల్లి. అయితే ఇప్పుడు దీపికి పిల్లికి మాత్రం స్టార్ మా మంచి ఆఫర్ ఇచ్చింది. కామెడీ స్టార్స్ షోకు సోలో యాంకర్‌గా మారింది. అంతకు ముందు ఆ స్థానంలో వర్షిణి ఉండేది. ఆమె వెళ్లిపోయాక..

Deepika Pilli Funny Post On Horror Movies

Deepika Pilli Funny Post On Horror Movies

దీపిక పిల్లికి చాన్స్ వచ్చింది. ఇప్పటికైతే దీపిక పిల్లి ఇంకా ఉంది. తన ముద్ర వేస్తోంది గానీ స్టార్ యాంకర్‌గా మాత్రం పేరు తెచ్చుకోవడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం దీపిక క్రేజ్ మామూలుగా ఉండదు. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా తన అలవాట్లను తెలిపే ఓ పోస్ట్ చేసింది. రాత్రిపూట ఎవరైతే హారర్ సినిమాలు చూసి ప్రశాంతంగా పడుకుంటారో.. వారు దెయ్యాల్లాంటి వారే అని కొటేషన్ ఉంది. అవును నేను అలాంటిదాన్నే అని చెప్పుకొచ్చింది దీపిక.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp