Rashmi Deepika Pilli : ఇద్దరూ కలిసి ఒకేసారి అలా.. యాంకర్ రష్మీతో దీపిక పిల్లి
Rashmi Deepika Pilli ఢీ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దీపిక పిల్లికి క్రేజ్ మరింతగా పెరిగింది. షో ద్వారా మంచి పాపులారిటీ కూడా దక్కింది. షోలో తనతో పాటు మరో మెంటర్‌గా ఉన్న యాంకర్ రష్మీతో దీపికకు మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. ఇద్దరు కలిసి షోలో కలిసి చేసే సందడి అంతా ఇంతా కాదు. తమపై ఆది పంచులు వేసిన కూడా వాటిని లైట్ తీసుకుంటూ షోలో కామెడీ పంచుతుంటారు ఈ ఇద్దరు భామలు. వారి అందంతో ప్రేక్షకకులను కట్టిపడేస్తుంటారు.

Deepika Pilli Shares Funny Moment With Anchor Rashmi
వీరిద్దరికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. వీరు చేసే పోస్టుల కోసం ఎదురుచూసే వారు కూడా ఉన్నారు. రష్మీ, దీపిక ఢీ షోలో మాత్రమే.. ఇద్దరు కలిసి బయట ఎంజాయ్ చేసిన ఫొటోలను, వీడియోలను కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ మధ్య సుధీర్ అక్క కూతురు యోషితతో దీపిక, రష్మీ కారులో కలిసి బయటకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోపై ఎన్ని రకాల కామెంట్స్ కూడా వచ్చాయి.
Rashmi Deepika Pilli సండే రోజున దీపిక, రష్మీ రచ్చ..

Deepika Pilli Shares Funny Moment With Anchor Rashmi
అయితే షో బయట, వెలుపల కూడా దీపిక, రష్మీ చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఆదివారం ఇద్దరు కలిసి బయట ఎంజాయ్ చేశారు. ఇద్దరు కలిసి ఉన్న ఓ చిన్న మూమెంట్‌ను షేర్ చేసిన దీపిక.. హెయిర్ కట్ తర్వాత ఫీలింగ్ అని పేర్కొంది. రష్ అక్క అనే ట్యాగ్ కూడా చేర్చింది. అందులో రష్మీ వెనకాల జట్టును కిందకు మీదకు ఆడిస్తూ కనిపించారు. అంతేకాకుండా వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.