Deepika Pilli : డాన్స్ తో ఆద‌ర‌గొట్టిన దీపికా పిల్లి.. శేఖ‌ర్ మాస్ట‌ర్ తో క‌లిసి స్టెప్పులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Deepika Pilli : డాన్స్ తో ఆద‌ర‌గొట్టిన దీపికా పిల్లి.. శేఖ‌ర్ మాస్ట‌ర్ తో క‌లిసి స్టెప్పులు

Deepika Pilli : టిక్ టాక్ వల్ల ఎంత మంది ఫేమస్ అయ్యారు.. ఇంకెంత మంది ట్రోలింగ్‌కు గురయ్యారు. టిక్ టాక్ వల్ల ఎంతో మంది ప్రతిభా వంతులు వెలుగులోకి వచ్చారు. వెండితెర, బుల్లితెర మీద చాన్సులు కూడా పట్టేశారు. అలాంటి వారిలో దీపిక పిల్లి కూడా ఒక‌రు. టిక్ టాక్ ఫేమ్ దీపిక కాస్తా ఢీ ఫేమ్ దీపికగా మారిపోయింది. టిక్ టాక్ ఫేమ్ ద్వారానే ఢీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది దీపికా. సోష‌ల్ మీడియాలో […]

 Authored By mallesh | The Telugu News | Updated on :7 April 2022,10:00 am

Deepika Pilli : టిక్ టాక్ వల్ల ఎంత మంది ఫేమస్ అయ్యారు.. ఇంకెంత మంది ట్రోలింగ్‌కు గురయ్యారు. టిక్ టాక్ వల్ల ఎంతో మంది ప్రతిభా వంతులు వెలుగులోకి వచ్చారు. వెండితెర, బుల్లితెర మీద చాన్సులు కూడా పట్టేశారు. అలాంటి వారిలో దీపిక పిల్లి కూడా ఒక‌రు. టిక్ టాక్ ఫేమ్ దీపిక కాస్తా ఢీ ఫేమ్ దీపికగా మారిపోయింది. టిక్ టాక్ ఫేమ్ ద్వారానే ఢీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది దీపికా. సోష‌ల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ, వీడియోలతో హ‌ల్ చ‌ల్ చేస్తూ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇక రష్మీతో దీపిక కలిసి అల్లరి మామూలుగా ఉంది. పిల్లి చెల్లి అంటూ దీపిక మీద రష్మీ ప్రేమను కురిపిస్తూ ఉంటుంది. వీకెండ్ వస్తే చాలు ఈ ఇద్దరూ కలిసి పార్టీలు చేసుకుంటూ ఉంటారు.

ఢీ షోలో యాంకర్‌గా చేసిన దీపిక పిల్లికి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఢీ షోలో దీపికా తన డాన్స్, అంద చందాలతో అందరిని ఆకట్టుకుంది. సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ ఫొటోస్ ని వీడియోస్ ని అప్లోడ్ చేస్తుంట‌ది. కాగా క్రేజీ ఫోటో షూట్స్ చేస్తూ కుర్రాళ్ల‌ గుండెల్లో గుబులు రేపుతోంది. రోజు రోజుకూ దీపికా పిల్లి పాపులారిటీ రెట్టింపు అవుతుండగా, మరింత రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తోంది. దీపికా పిల్లికి ఇంస్టాగ్రామ్ లో రెండు మిలియన్స్ ఫాలోవ‌ర్స్ ఉండ‌టం విశేషం.

deepika pilli started with dance steps with shekhar master

deepika pilli started with dance steps with shekhar master

Deepika Pilli : సాహో పాట‌తో..

కాగా ప్ర‌స్తుతం శేఖ‌ర్ డ్యాన్స్ మాస్ట‌ర్ తో క‌లిసి దీపికా పిల్లి చేసిన డ్య‌న్స్ తెగ వైరల్ అవుతోంది. సాహో సినిమాలోని ఓ పాట పై స్టెప్పులేస్తూ ఆక‌ట్టుకున్నారు. హాట్ హాట్ డ్రెస్సులో దీపికా అద‌ర‌గొట్టింది. శేఖ‌ర్ మాస్ట‌ర్ తో పోటీ ప‌డుతూ మ‌రీ స్టెప్పులేసింది దీపికా పిల్లి. ఈ వీడియో ప్ర‌స్తుతం యూట్యూబ్ లో వైర‌ల్ కాగా నైస్… సూప‌ర్… బ్యూటిఫుల్ అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=HVVC9u9-frM

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది