Deepika Plli : షాట్ గ్యాప్‌లో దీపిక పిల్లి హల్చల్.. టిక్ టాక్ భామ మామూల్ది కాదు

Authored By Sam C | The Telugu News | Published on: March 10, 2022, 4:20 pm

Deepika Plli : టిక్ టాక్ వ‌ల‌న ఫేమస్ అయిన వారిలోదీపిక పిల్లి ఒక‌రు.ఈ అమ్మ‌డు ఢీ ఫేమ్ దీపికగా మారిపోయింది. టిక్ టాక్‌లో ఏవేవో పిచ్చి గెంతులు వేసిన దీపకకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ ఫేమ్ ద్వారానే ఢీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఢీ 13వ సీజన్‌లో కనిపించింది. కానీ వర్షిణి పాపులర్ అయినంతగా దీపిక కాలేకపోయింది. ఆదితో ట్రాక్ న‌డిపిద్దామ‌ని చూడ‌గా, అది వ‌ర్కవుట్ కాక‌పోవ‌డంతో ఒక్క సీజ‌న్‌కే ప‌క్క‌న పెట్టేశారు. అయితే ఇప్పుడు మాటీవీలో ఏదో షో చేస్తున్న దీపి సోష‌ల్

దీపిక సోష‌ల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ, వీడియోలతో హల్చల్ చేస్తూ క్రేజ్‌ను కాపాడుకుంటూ ఉంటోంది. ఇక రష్మీతో దీపిక కలిసి అల్లరి మామూలుగా ఉండ‌ద‌లు. పిల్లి చెల్లి అంటూ దీపిక మీద రష్మీ ప్రేమను కురిపిస్తూ ఉంటుంది. వీకెండ్ వస్తే చాలు ఈ ఇద్దరూ కలిసి పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఇక దీపిక త‌న‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె పిక్స్ షేర్ చేస్తే… గార్జియస్, సూపర్, అతిలోక సుందరి అంటూ… కామెంట్స్ చేస్తున్నారు. ఇక లక్షల్లో దీపిక పిల్లి ఫొటోలకు లైక్స్ కొడుతుండగా, క్షణాల్లో వైరల్ కావడం జరుగుతుంది.మీడియాలో ఎక్కువ‌గా సంద‌డి చేస్తుంది.

deepika plli reel video in shot gap

deepika plli reel video in shot gap

Deepika Plli : దీపిక టైం అస్స‌లు వేస్ట్ చేయ‌ట్లేదు…!

దీపికా పిల్లి తాజాగా షూట్ గ్యాప్‌లో రీల్ వీడియో చేసింది. ఇది చూసిన నెటిజ‌న్స్ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అస్స‌లు ఏ మాత్రం టైం వేస్ట్ చేస్తున్న‌ట్టు లేదుగా.. దీపిక హంగామా ఈ రేంజ్‌లో ఉంటే త‌ట్టుకోవ‌డం క‌ష్టం అంటూ కొందరు నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. 2018లో టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా అతి తక్కువ కాలంలో మిలియన్స్ లో ఫాలోయర్స్ సంపాదించారు. 2020లో టిక్ టాక్ బ్యాన్ చేసే నాటికి ఆమె ఫాలోయర్స్ 10 మిలియన్స్ ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, టిక్ టాక్ లో దీపికా ఎంత పెద్ద సెలబ్రిటీనో.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp