Hyper Aadi : హగ్గులతో నలిపేస్తోన్న జానీ మాస్టర్.. రగిలిపోతోన్న హైపర్ ఆది

Authored By Sam C | The Telugu News | Published on: March 10, 2022, 2:00 pm

Jhani Master : బుల్లితెర‌పై ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచే షో ఢీ. సక్సెస్ ఫ‌ల్ గా 13 సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ షో ప్ర‌స్తుతం 14వ సీజ‌న్ జరుపుకుంటుంది. ఈ సీజ‌న్ లో చాలా మార్పులు జ‌రిగాయి.పూర్ణ స్థానంలో జ‌డ్జిగా నందిత శ్వేత వ‌చ్చి చేరింది. ఇక సుధీర్,ర‌ష్మీ స్థానంలో ర‌వికృష్ణ‌, న‌వ్య‌సామి, అఖిల్ కూడా వ‌చ్చాడు. అయితే ఎంత‌మంది ఉన్నా హైప‌ర్ ఆది స్పెష‌ల్ అట్రాక్ష‌న్ అనే చెప్పాలి. మ‌నోడు వేసే పంచ్‌ల‌కి ప్ర‌తి ఒక్క‌రు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతుంటారు. అప్పుడప్పుడూ తన కడుపు మంటను కూడా అలాగే బయటపెడుతుంటాడు ఆది.హైప‌ర్ ఆది కేవలం జబర్దస్త్ కామెడీ షో మాత్రమే కాదు..

ఢీలో కూడా కనిపిస్తున్నాడు. అక్కడ్నుంచి సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ తప్పుకున్నా.. ఆది మాత్రం అక్కడే ఉన్నాడు. అక్కడ కామెడీ పార్ట్ మొత్తం ఈయనొక్కడే చూసుకుంటున్నాడు. బిగ్ బాస్ ఫేమ్ అఖిల్‌ను కూడా తీసుకున్నా కూడా పెద్దగా యూజ్ అయితే లేదు. హైపర్ ఆది కూడా ఇదే పంచులు వేస్తుంటాడు ఈయనపై. నువ్వుండి అమ్మాయిలను చూడటం తప్ప ఇంకేం చేస్తున్నావ్ భయ్యా అంటూ అఖిల్‌పై బాగానే డైలాగులు వేస్తుంటాడు హైపర్ ఆది.జానీ మాస్ట‌ర్ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, మనోడు అమ్మాయిలని తెగ న‌లిపేస్తున్నాడు.

Hyper Aadi comments on Jani Master

Hyper Aadi comments on Jani Master

Hyper Aadi : జానీ మాస్ట‌ర్ తెగ న‌లిపేస్తున్నాడుగా..!

ప్రియ‌మ‌ణి, నందిత‌, నవ్య స్వామి ఇలా సెట్‌లో ఉన్న వాళ్లంద‌రిని కౌగిలించుకున్నాడు. ఇది చూసి ఆది తెగ ర‌గిలిపోయాడు. మా పేర్లు చెప్పుకుని ఎన్నిసార్లు హగ్స్ తీసుకుంటారు అంటూ సెటైర్ వేసాడు. అయినా కూడా జానీ మాస్టర్ తగ్గేదే లే అనేసాడు. మీకు అయితే ఇవ్వరు.. నాకు చూశావా? అన్నట్టుగా హగ్గులు తీసుకుంటూ జానీ మాస్టర్ రచ్చ చేసాడు. మొత్తానికి జానీ మాస్ట‌ర్ చేస్తున్న ర‌చ్చ చూసి ప్ర‌తి ఒక్క‌రు స్ట‌న్ అవుతున్నారు.జానీ మాస్ట‌ర్ కొరియోగ్రాఫ‌ర్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన విష‌యం తెలిసిందే. ఇండ‌స్ట్రీలోని చాలా మంది స్టార్స్‌తో క‌లిసి ఆయ‌న ప‌ని చేశారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp