Deepthi Sunaina : ఫేమ‌స్ సాంగ్‌కి క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చిన దీప్తి సున‌య‌న‌.. అద‌రగొట్టేశావు అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

Authored By Sam C | The Telugu News | Updated on: April 29, 2022, 5:35 pm

Deepthi Sunaina : యూట్యూబ‌ర్‌గా కెర‌ర్ ప్రారంభించి బిగ్ బాస్ షోతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది దీప్తి సున‌య‌న‌. ఈ అమ్మ‌డు ష‌ణ్ముఖ్ తో ప్రేమలో ఉంటూ తెగ వార్త‌ల‌లో నిలిచేది. వీళ్లిద్దరూ చాలా కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఆరంభంలో ఎవరికి వాళ్లు వీడియోలు చేస్తూ వచ్చినా.. ఆ తర్వాత జంటగా మారారు. ఈ క్రమంలోనే ఎన్నో సిరీస్‌లు, డ్యాన్స్ వీడియోలు, ప్రైవేట్ ఆల్బమ్స్ వంటివి చేశారు. ఆ సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో కూడా పడిపోయారు. ఇటీవలే దీప్తి సునైనా.. షణ్ముఖ్ జస్వంత్‌కు బ్రేకప్ చెప్పేసింది. దీంతో అప్పటి నుంచి ఈ న్యూస్ హాట్ టాపిక్ అవుతూనే ఉంది.

బిగ్ బాస్ విషయంలో షణ్ముఖ్ కంటే సీనియర్ దీప్తి. షణ్ముఖ్ ఐదో సీజన్‌కి కంటెస్టెంట్‌గా వెళ్తే.. దీప్తి రెండో సీజన్‌కి కంటెస్టెంట్‌గా వెళ్లింది. అయితే ఆ సీజన్‌లో దీప్తి.. తనీష్‌తో క్లోజ్‌గా ఉండేది. ఈ ఇద్దరి రిలేషన్‌పై చాలా రూమర్లు నడిచాయి. అయితే మరీ షణ్ముఖ్-సిరి మాదిరిగా.. మితిమీరి ముద్దులు, హగ్గులు.. ఒకే బెడ్.. ఒకే దుప్పటి లాంటి యవ్వారాలు లేవు కానీ.. వాళ్ల స్థాయిలో పెర్ఫామెన్స్ వాళ్లూ ఇచ్చారు.అయితే సిరి- ష‌ణ్ముఖ్‌ది కాస్త హ‌ద్దులు దాటే సరికి దీప్తి అస్స‌లు త‌ట్టుకోలేక‌పోయింది. హౌజ్ నుండి బ‌యట‌కు వ‌చ్చాక బ్రేక‌ప్ చెప్పింది.

deepthi sunaina cute expressions

deepthi sunaina cute expressions

Deepthi Sunaina : మైమ‌రిపించేశావుగా..

ష‌ణ్ముఖ్ నుండి విడిపోయిన‌ప్ప‌టి నుండి దీప్తి సున‌య‌న సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. ఆల్బ‌మ్స్, రీల్స్ చేస్తూ ర‌చ్చ లేపుతుంది. ఈ అమ్మ‌డి హంగామా సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. నెటిజ‌న్స్ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా దీప్తి క్యూట్ సాంగ్‌కి వెరైటీ ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ ఆక‌ట్టుకుంటుంది. ఈ అమ్మ‌డి ప‌ర్‌ఫార్మెన్స్‌కి నెటిజ‌న్స్ మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్ర‌స్తుతం దీప్తి వీడియో వైర‌ల్‌గా మారింది.సోషల్ మీడియా ద్వారా ప్రేమలో పడిన దీప్తీ సునయన.. షణ్ముఖ్ జస్వంత్ చాలా కాలంగా జంటగా సందడి చేయ‌గా, వారు విడిపోవ‌డం అభిమానులు త‌ట్టుకోలేక‌పోతున్నారు. తిరిగి క‌ల‌వాల‌ని కోరుకుంటున్నారు.

Sam C

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp