Deepthi Sunaina Shanmukh : దీప్తి సునయని తప్పు పట్టిన శ్రీ రెడ్డి.. క్లారిటీ ఇచ్చిన షణ్ముఖ్ మాజీ ప్రేయసి
Deepthi Sunaina: యూ ట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో సిరీ హగ్గులు..ముద్దులే వీరి మధ్య చిచ్చు పెట్టాయంటూ సోషల్ మీడియా కోడై చూస్తుంది. ఈమధ్యలో బాధతో దీప్తీ సునైనా పోస్ట్ లమీద పోస్ట్ లు పెడుతూనే ఉంది. అంతే కాదు షన్నూ చెప్పేది వినిపించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. అయితే సోషల్ మీడియాలో వీరి బ్రేకప్ స్టోరీపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.ఈ ఇష్యూ గురించి ఐటమ్ బాంబ్ శ్రీరెడ్డి కూడా స్పందించింది. తన మార్క్ కామెంట్స్ తో.. నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
బిగ్ బాస్ లో జరిగిన సిరీ-షణ్ముఖ్ హగ్గులు కారణంగానే షన్నూకి దీప్తీ బ్రేకప్ చెప్పడం కరెక్ట్ కాదు అన్నారు. షణ్ముఖ్ ను అనే ముందు తాను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఏ చేసిందో తెలుసుకోవాలి.. ఒక పర్సన్(తనిష్) తో నువ్వు ఎంత క్లోజ్ గా ఉన్నావు.. అతనికి నీకు మధ్య ఎన్ని రూమర్స్ బయటకు వచ్చాయి. అయినా బిగ్ బాస్ హౌస్ లో మీ వేశాలు అందరూ చూశారు.. మరి ఈ విషయంలో నువ్వు ఏం సమాధానం చెపుతావు. నీకు ఒక రూలు.. షణ్ముఖ్ కి ఒక రూలా.. ఇదెక్కడి న్యాయం అంటూ.. మండి పడింది శ్రీరెడ్డి.

deepthi sunaina Shanmukh stunning reply to sri reddy
Deepthi Sunaina Shanmukh : దీప్తి స్టన్నింగ్ రిప్లై
తాజాగా శ్రీ రెడ్డి కామెంట్స్ పై దీప్తి సునయన స్పందించింది. నేపు అప్పుడు చిన్న పిల్లని షో గురించి కాని రిలేషన్ గురించి కాని ఏమి తెలియదు. ఇప్పుడు జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను అంటూ తనదైన శైలిలో బదులు ఇచ్చింది. ప్రస్తుతం దీప్తి సునయన చేసిన కామెంట్స్ శ్రీ రెడ్డి మాటలకు సమాధానంగా చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇక ఇటీవల వీరిద్దరి రిలేషన్ గురించి షణ్ముఖ్ తండ్రి స్పందిస్తూ వారిద్దరు త్వరలోనే కలుస్తారు అని పేర్కొన్నాడు.