
Dethadi Harika punch to the netigens
Dethadi Harika: యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్, సెటైరికల్, కామెడీ వీడియోలతో అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ దేత్తడి హారిక. ఈ అమ్మడు ఇచ్చిపడేస్తా అంటూ బిగ్‌బాస్ 4లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాల్గో సీజన్‌లో ఈ అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మేల్ కంటెస్టెంట్లకి దీటుగా రాణించింది. షో రక్తికట్టడంతో తనవంతు పాత్ర పోషించింది. రోజుకో రకంగా రెచ్చిపోతూ సోషల్ మీడియానే వేడెక్కిస్తుంది అలేఖ్య హారిక ఉరఫ్ దేత్తడి హారిక. యూ ట్యూబ్ చూసే ఆడియన్స్‌కు మాత్రమే ఈ పేరుతో ఇంతకు ముందు పరిచయం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.. తెలుగు వాళ్ళకు బాగా చేరువైన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4తో చాలా మందికి పరిచయం అయింది ఈ భామ.
హారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ ముద్దుగుమ్మపై ప్రశంసలు కురిపించే వాళ్లే కాదు విమర్శలు చేసే వాళ్లు కూడా ఉంటారు. ముఖ్యంగా బుడ్డది అంటూ విమర్శలు కురిపిస్తుంటారు. ఈ క్రమంలో ‘ఎవడు పడితే వాడు.. బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలు ఊడదీసి కొడతా.. అలా పిలవాలంటే ఒక అర్హత ఉండాలి లేదా నా అభిమాని అయ్యి ఉండాలి’.. రామయ్య వస్తావయ్యా సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన ఈ డైలాగ్ ని తనని విమర్శించే వాళ్లకు తగిలేలా కామెంట్ పెట్టింది.
Dethadi Harika punch to the netigens
ఈ బుడ్డోడు డైలాగ్‌ని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ‘అదీ అర్ధమైంది కదా??’ అంటూ తన హైట్ గురించి మాట్లాడి ట్రోల్ చేసేవారికి క్రియేటివిటీ జోడించి మరీ వార్నింగ్ ఇచ్చింది హారిక. ఇక బిగ్‌బాస్ 4 తర్వాత సినిమా అవకాశాలు లేని హారిక రెగ్యూలర్ లాగే తన వీడియోలపై ఫోకస్ పెట్టింది. స్పెషల్ ఆల్బమ్ సాంగ్‌లతో ఆకట్టుకుంది. రెండు మూడు పల్లెటూరి జానపద పాటలతో హంగామా చేసింది. మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తుంది. తాజాగా ఆమె నటించిన `గానం` అనే సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
This website uses cookies.