Dethadi Harika : అర్ధ‌మైంది క‌దా, బుడ్డ‌ది అంటే గుడ్డ‌లూడ‌దీసి కొడ‌తా అంటూ దేత్త‌డి హారిక‌ వార్నింగ్

Authored By Sam C | The Telugu News | Updated on : 12 February 2022, 9:30 pm

Dethadi Harika: యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్, సెటైరికల్‌, కామెడీ వీడియోలతో అందరి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ దేత్త‌డి హారిక‌. ఈ అమ్మ‌డు ఇచ్చిపడేస్తా అంటూ బిగ్‌బాస్‌ 4లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాల్గో సీజన్‌లో ఈ అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మేల్ కంటెస్టెంట్లకి దీటుగా రాణించింది. షో రక్తికట్టడంతో తనవంతు పాత్ర పోషించింది. రోజుకో రకంగా రెచ్చిపోతూ సోషల్ మీడియానే వేడెక్కిస్తుంది అలేఖ్య హారిక ఉరఫ్ దేత్తడి హారిక. యూ ట్యూబ్ చూసే ఆడియన్స్‌కు మాత్రమే ఈ పేరుతో ఇంతకు ముందు పరిచయం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.. తెలుగు వాళ్ళకు బాగా చేరువైన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4తో చాలా మందికి పరిచయం అయింది ఈ భామ.

హారిక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అశేష‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ ముద్దుగుమ్మ‌పై ప్ర‌శంస‌లు కురిపించే వాళ్లే కాదు విమ‌ర్శ‌లు చేసే వాళ్లు కూడా ఉంటారు. ముఖ్యంగా బుడ్డ‌ది అంటూ విమ‌ర్శ‌లు కురిపిస్తుంటారు. ఈ క్ర‌మంలో ‘ఎవడు పడితే వాడు.. బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలు ఊడదీసి కొడతా.. అలా పిలవాలంటే ఒక అర్హత ఉండాలి లేదా నా అభిమాని అయ్యి ఉండాలి’.. రామయ్య వస్తావయ్యా సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన ఈ డైలాగ్ ని త‌న‌ని విమ‌ర్శించే వాళ్లకు త‌గిలేలా కామెంట్ పెట్టింది.

Dethadi Harika punch to the netigens

Dethadi Harika punch to the netigens

Dethadi Harika : మొత్తానికి వాళ్ల‌కి గ‌ట్టిగానే పంచ్ ఇచ్చింది..!

ఈ బుడ్డోడు డైలాగ్‌‌ని తన ఇన్ స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్ చేస్తూ.. ‘అదీ అర్ధమైంది కదా??’ అంటూ తన హైట్ గురించి మాట్లాడి ట్రోల్ చేసేవారికి క్రియేటివిటీ జోడించి మరీ వార్నింగ్ ఇచ్చింది హారిక. ఇక బిగ్‌బాస్‌ 4 తర్వాత సినిమా అవకాశాలు లేని హారిక రెగ్యూలర్‌ లాగే తన వీడియోలపై ఫోకస్‌ పెట్టింది. స్పెషల్‌ ఆల్బమ్‌ సాంగ్‌లతో ఆకట్టుకుంది. రెండు మూడు పల్లెటూరి జానపద పాటలతో హంగామా చేసింది. మరోవైపు వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తుంది. తాజాగా ఆమె నటించిన `గానం` అనే సిరీస్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతుండటం విశేషం.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp