Sri Reddy : ఒకప్పుడు మంచి చిత్రాలు తెరకెక్కించిన పూరీ జగన్నాథ్ ఇటీవలి కాలంలో చాలా వీక్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేశాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో ఆ ఊపులోనే లైగర్ సినిమా చేశాడు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజ్ కి ముందు హైప్ విపరీతంగా పెంచడం.. కథపై ఫోకస్ పెట్టకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకి గురవుతున్నారు. లైగర్ చిత్రానికి వస్తున్న నెగిటివ్ రెస్పాన్స్ ఇప్పుడు మరో మూవీపై ప్రభావం చూపుతోంది. లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరి మాట్లాడుతూ.. లైగర్ కన్నా డబుల్ బడ్జెట్ తో జనగణమన తెరకెక్కిస్తున్నాం అని ప్రకటించాడు. కానీ ఊహించని విధంగా లైగర్ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
దీనితో ‘జనగణమన’ ఆగిపోయినా ఆశ్చర్యం అవసరం లేదు అని నెటిజన్లు అంటున్నారు. ఇదే అదునుగా మహేష్ ఫ్యాన్స్ పూరి జగన్నాధ్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ రెడ్డి తనదైన పంథాలో డైరెక్టర్ పూరి జగన్నాథ్‌పై ఘాటు, హాటు కామెంట్స్ చేసింది. ‘లైగర్’ సినిమా ఫలితంపై పూరి జగన్నాథ్‌ను టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. ‘‘తీసేది ఏమో అట్టర్ ఫ్లాప్ సినిమాలు, మరలా మహేష్ బాబు గారు డేట్స్ ఇవ్వటం లేదు, అని బాబు మీద పడి ఏడవటం, ఎంత వరకు కరెక్ట్ అధ్యక్షా. లైగర్‌కి ముందు లైగర్ తర్వాత అంట.. అనవసరమైన హైప్ లు అవసరమా, కంటెంట్ వున్నోడికి హైప్ అవసరం లేదు,
లైగర్ కన్నా కార్తికేయ 2 బెటర్, బెటర్ కూడా కాదు కార్తికేయ 2 ఒక అద్భుతం’’ అని శ్రీ రెడ్డి తెలియజేసింది. జనగణమన చిత్రాన్ని భారీ బడ్జెట్ లో మహేష్ బాబుతో తెరకెక్కించాలని పూరి కొన్నేళ్ల క్రితం భావించాడు. అనౌన్స్ మెంట్ కూడా జరిగింది. కానీ ఆ చిత్రం ఆగిపోయింది. ఆ తర్వాత పూరి ఓ ఇంటర్వ్యూలో.. మహేష్ బాబు తాను హిట్స్ లో ఉన్నప్పుడు మాత్రమే సినిమా చేస్తాడు అని బాహాటంగానే విమర్శించాడు. ప్రస్తుతం తాను ఫ్లాప్స్ లో ఉండడం వల్ల జనగణమన చేయడం లేదని పూరి విమర్శించారు. ఏదేమైన లైగర్ రిజల్ట్ ఇలా కావడంతో మహేష్ ఫాన్స్ గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. కానీ కామన్ ఆడియన్స్ మాత్రం పూరి జగన్నాధ్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.