Devullu Movie Child Artist : ఆ పాప ఇంత ఎదిగిపోయిందా? దేవుళ్లు సినిమాలోని చిన్నారి ఎలా మారిందంటే?

 Authored By prabhas | The Telugu News | Updated on :19 July 2022,1:30 pm

Devullu Movie Child Artist : సుమ క్యాష్ షో ఎంతగా వైరల్ అవుతుంటుందో అందరికీ తెలిసిందే. కొత్త కొత్త గెస్టులను పట్టుకొచ్చి వారితో ఆడుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా సుమ క్యాష్ షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది. ఈ శనివారం ప్రసారం కాబోతోన్న ఎపిసోడ్‌లో నిహారిక, నిఖిల్, అనిల్, నిత్యా శెట్టి వచ్చారు. వీరంతా కలిసి వెబ్ సిరీస్ చేసినట్టున్నారు. ఈ నిత్యా శెట్టి ఎవరో కాదు.. దేవుళ్లు సినిమాలో ఉండే పిల్లలో ఒకరు. నీ ప్రేమ కోరే చిన్నారులం అంటూ పాట పాడి అందరినీ ఏడిపించేశారు. ఆ చిన్నారే ఇప్పుడు హీరోయిన్‌గా మారింది. ఇన్నేళ్ల తరువాత ఇలా అందరి ముందుకు రావడం అంతా షాక్ అవుతున్నారు.

దేవుళ్లు సినిమాలో నటించింది ఈ అమ్మాయే అని చూపించారు. అంతే కాకుండా ఫేమస్ పాటను ప్లే చేసి చూపించారు. నీ ప్రేమ కోరే చిన్నారులం అంటూ పాటను చూపించారు. ఇక ఇందులో నటించడం ఎలా ఉందంటూ నిత్యా శెట్టిని సుమ అడిగింది. ఆమె ఏ సమాధానం చెప్పకుండా తెగ నవ్వేసింది. కానీ ఇంతలో యూట్యూబర్ నిఖిల్ మాత్రం కౌంటర్ వేశాడు. ఇప్పుడు కిలోలకు కిలోల మేకప్ వేయాల్సి వస్తోందంటూ కౌంటర్ వేశాడు. మొత్తానికి ఈ ప్రోమోలో నిహారిక మాత్రం అదిరిపోయింది. నిహారిక నిహారిక అనే పాటను ప్లే చేసి మెగా డాటర్‌‌ను ఖుషీ చేశారు.

Devullu Movie fame Child Artist Nitya Shetty in Cash Promo

Devullu Movie fame Child Artist Nitya Shetty in Cash Promo

నిహారిక కోసం తన పేరు మీద పాట ఉండటంతో సుమ కూడా కౌంటర్ వేసింది. నా పేరు మీద కూడా ఓ పాట ఉంది తెలుసా? అంటూ సుమం, ప్రతి సుమం.. అనే పాటను పాడింది. మసులోళ్లకు అలాంటి పాటలే వేస్తుంటారు అని నిఖిల్ కౌంటర్ వేస్తాడు. అలా మొత్తానికి సుమ, నిహారిక, నిఖిల్ సందడితో ప్రోమో అదిరిపోయింది. ఈ ప్రోమోలోనే మై విలేజ్ షో ఫేమ్ అనిల్ నవ్వించేశాడు. గ్యాస్ ఉందంటూ వేసిన స్కిట్ బాగానే వర్కవుట్ అయింది. డాక్టర్‌గా నిహారిక నటించింది. సుమ రాజ్యం అంటూ వేసిన స్కిట్ కూడా బాగానే నవ్వులు పూయించింది. ఇందులో ఏడిపించే సీన్లు లేకపోవడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి