తమిళ స్టార్ హీరో అయిన ధనుష్ ఇప్పటికే హిందీలో మరియు మలయాళంలో స్టార్ గా గుర్తింపు దక్కించుకుని తన సినిమాలు ఆయా భాషల్లో కూడా ఆడే విధంగా మంచి స్టార్ డమ్ ను దక్కించుకున్నాడు. తెలుగు లో కూడా ఈయన నటించిన పలు సినిమా లు విడుదల అయ్యాయి. కాని ఏ ఒక్క సినిమా కూడా ఇక్కడ కమర్షియల్ గా బిగ్ సక్సెస్ ను అందుకోలేదు. అంతే కాకుండా తెలుగు లో ధనుష్ అంటే ఇప్పటికి కూడా పెద్దగా గుర్తింపు లేని హీరోగానే ఉన్నాడు. ఆయన సినిమా అనగానే ఎగురుకుంటూ వెళ్లే వారు తెలుగు లో ఏ ఒక్కరు కూడా లేరు. దాంతో ఇక్కడ మార్కెట్ పై ధనుష్ దృష్టి పెట్టాడు.
తెలుగు లో సినిమాలు చేయాలనే ఆలోచన వచ్చిన వెంటనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ధనుష్ సిద్దం చేశాడు. శేఖర్ కమ్ముల నరేట్ చేసిన స్క్రిప్ట్ కు అంతా ఓకే చెప్పిన హీరో ధనుష్ షూటింగ్ సమయంలో మాత్రం అప్పుడప్పుడు చిన్న చిన్న మార్పులు చెబుతూ ఉంటాను వాటికి నో చెప్పవద్దు అన్నాడట. దాంతో శేఖర్ కమ్ముల నీకో దండం బాబు అన్నట్లుగా ఆయన నుండి దూరం జరిగినట్లుగా తెలుస్తోంది. శేఖర్ కమ్ముల తప్పుకున్న వెంటనే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ధనుష్ ఓకే చెప్పాడు.
ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి కాంబోలో ‘సార్’ అనే సినిమా ప్రకటన వచ్చింది. సినిమా కు సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తి అయ్యింది. సినిమా నుండి ధనుష్ లుక్ ను కూడా రివీల్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ధనుష్ సినిమా గురించి వార్తలు ఏమీ రాలేదు. దాంతో ఏం జరిగిందని వాకబు చేయగా హీరో ధనుష్ షూటింగ్ సమయంలో పదే పదే స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు సూచిస్తున్నాడు అంటూ గుసగుసలు వస్తున్నాయి. అందుకే తాను సినిమాను వదిలేశాను అన్నట్లుగా వెంకీ అట్లూరి చెప్పాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం సార్ సినిమా క్యాన్సిల్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఖచ్చితంగా వీరి కాంబో సినిమా షూటింగ్ పూర్తి అయ్యి ఇదే ఏడాది చివరి వరకు వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.