అక్క‌డ‌ నేను చేసింది ఒక‌టి వాళ్లు చూపించింది ఒక‌టి.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన ధన్య బాలకృష్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

అక్క‌డ‌ నేను చేసింది ఒక‌టి వాళ్లు చూపించింది ఒక‌టి.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన ధన్య బాలకృష్

 Authored By govind | The Telugu News | Updated on :16 May 2021,8:15 pm

Dhanya balakrishna : ధన్య బాలకృష్ణ టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ అడపదడపా సినిమాలు చేస్తోంది. అయితే స్టార్ హీరోయిన్ గా మాత్రం ఈ రెండు సినిమా ఇండస్ట్రీలలో ఎదగలేకపోతోంది. టాలెంట్ ఉన్నప్పటికి స్టార్ స్టేటస్‌కు ఆమడ దూరంలో ఆగిపోయింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, శృతీ
హాసన్‌ జంటగా నటించిన ‘సెవంత్‌ సెన్స్‌’ సినిమా నటించింది ధన్య బాలకృష్ణ. ఆ తర్వాత లవ్‌ ఫెయిల్యూర్‌, ఎటో వెళ్లిపోయింది సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది.

Dhanya balakrishna spends her weekened there

Dhanya balakrishna spends her weekened there ..

అంతేకాదు నేను శైలజ’, ‘రాజు గారి గది’, ‘రాజారాణి’, ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’, ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ వంటి పలు సినిమాలు చేసిన ధన్య బాలకృష్ణకు మంచి గుర్తింపు దక్కింది. ఇక తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన ముద్దు పేరు పప్పు అని, ప్రస్తుతం బెంగళూరులో ఉన్నానని వెల్లడించింది. ‘రాజారాణి’ సినిమాలో మందు తాగినట్లు చూపించారు, కానీఅది నిజం కాదని క్లారిటీ ఇచ్చింది. తాను తాగింది కేవలం మంచినీళ్లు మాత్రమేనట.

Dhanya balakrishna : ధన్య బాలకృష్ణకు పవన్‌ కల్యాణ్ అంటే క్రష్‌

ఎక్కువగా పార్టీలు కూడా అటెండ్ అవనని, అయితే తప్పకుండా వీకెండ్‌లో మాత్రం ఫ్రెండ్స్ అందరం కలిసి లంచ్ లేదా డిన్నర్‌కు వెళ్తామని తెలిపింది. ఇక తన ఫేవరేట్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, సూర్య, రణ్‌బీర్‌ కపూర్‌.. వాళ్ళంటే క్రష్‌ అని చెప్పుకొచ్చిన ధన్య బాలకృష్ణ ఎప్పుడు అవకాశం వచ్చినా వీరితో సినిమాచేయాలనుందనే విషయాన్ని బయటపెట్టింది. కాగా ధన్యకు తెలుగు కంటే కూడా తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు దక్కుతున్నట్టు
చెప్పుకొచ్చింది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది