Intinti Gruhalakshmi 27 Dec Today Episode : దివ్యను వదిలేసిన పోలీసులు.. లాస్య విషయంలో పరందామయ్య గొడవ.. బతిమిలాడి లాస్యను ఇంటికి తీసుకొచ్చిన నందు
ప్రధానాంశాలు:
దివ్య పోలీస్ స్టేషన్ లో ఉందని విక్రమ్ కు ఫోన్ చేసిన ఎస్ఐ
ఎస్ఐ కాలర్ పట్టుకున్న విక్రమ్
కమిషనర్ కు ఫోన్ చేసిన రాజ్యలక్ష్మి
Intinti Gruhalakshmi 27 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి 27 డిసెంబర్ 2023, బుధవారం 1138 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి కాఫీ పెట్టడం ఏంటి.. అసలు నా కోడలు ఏది.. నా కోడలు ఎక్కడ అని అడుగుతాడు పరందామయ్య. దీంతో మీరు అడుగుతోంది ఈ ఇంటి కోడలు లాస్య గురించే కదా. తను గుడికి వెళ్లింది. తను వచ్చేసరికి లేట్ అవుతుంది. నేను కాఫీ పెట్టనా అంటుంది తులసి. దీంతో అవసరం లేదు అంటాడు పరందామయ్య. తను గుడి నుంచి వచ్చాక నన్ను కలవమని చెప్పండి అని అంటాడు పరందామయ్య. దీంతో సరే అంటుంది తులసి. నందు, అనసూయకు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు దివ్య రాత్రి నుంచి కనిపించకపోవడంతో విక్రమ్ ఎలా స్పందిస్తాడో అని అందరూ వెయిట్ చేస్తుంటారు. ఇంతలో విక్రమ్ వచ్చి దివ్య కాఫీ అని అంటాడు. కాఫీ కావాలా.. నేను పెట్టిస్తాను అంటుంది రాజ్యలక్ష్మి. దీంతో దివ్య పెట్టిస్తుందిలే అంటాడు విక్రమ్. దివ్య పైన లేదా అంటుంది రాజ్యలక్ష్మి. దీంతో లేదు.. తను కిందికి వచ్చినట్టుంది అంటాడు విక్రమ్. దీంతో తను రాలేదు అంటారు. దీంతో తను ఎక్కడికి వెళ్లినట్టు అని అనుకుంటారు. వెంటనే విక్రమ్ తనకు ఫోన్ చేస్తాడు. మొబైల్ పైన్నే రింగ్ అవుతోంది అంటాడు బసవయ్య. ఇంతలో విక్రమ్ కు ఫోన్ వస్తుంది. హలో అంటాడు. రాంనగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐని మాట్లాడుతున్నా అంటాడు. దివ్య అంటే మీ ఆవిడేనా అంటాడు. దీంతో అవును అంటాడు. ఆవిడను ఫోన్ చేశాం. లాకప్ లో ఉంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేశాం అంటారు. తనను అరెస్ట్ చేయడం ఏంటి. ఆమె ఏం తప్పు చేసింది అంటే.. యాక్సిడెంట్ చేసింది. ఒక అమ్మాయి చావుకు కారణం అయింది అంటాడు ఎస్ఐ.
దీంతో తను ఏం తప్పు చేయలేదు సార్.. అంటే బాగుంది. తనేమో యాక్సిడెంట్ చేశాను అంటుంది. నువ్వేమో నిర్దోషి అంటున్నావు. ఏం అర్థం కావడం లేదు. ముందు నువ్వు పోలీస్ స్టేషన్ కు రా ఇక్కడ మాట్లాడుకుందాం అంటాడు పోలీసు. దీంతో విక్రమ్ కు ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేద్దాం అని రాజ్యలక్ష్మి, బసవయ్య అంటారు. ఏముంది.. పిచ్చి ఉందని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ చూపించడమే అంటాడు బసవయ్య. దీంతో విక్రమ్ కు కూడా ఏం చెప్పాలో అర్థం కాదు. విక్రమ్, బసవయ్య, రాజ్యలక్ష్మి ముగ్గురూ ఆసుపత్రికి వెళ్తారు. ఇంతలో ప్రియ వచ్చి ఎవ్వరూ కనిపించడం లేదు ఏంటి పిన్ని అంటే.. నాకేం తెలుసు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది బసవయ్య భార్య. వెంటనే నా కోడలును వదిలేయండి అని పోలీస్ స్టేషన్ కు వచ్చి అంటుంది రాజ్యలక్ష్మి. ఎస్ఐ గారు మా దివ్య ఎలాంటి యాక్సిడెంట్ చేయలేదు. ఎవ్వరినీ చంపలేదు అంటుంది రాజ్యలక్ష్మి. దీంతో అంటే అబద్ధం చెప్పిందా అంటాడు ఎస్ఐ. తను కావాలని అబద్ధం చెప్పలేదు. దివ్య.. మెంటల్ డిజార్డర్ పేషెంట్ అని మెడికల్ రిపోర్ట్స్ చూపిస్తారు ఎస్ఐకి. ఓ పిచ్చా అంటాడు. దీంతో నా దివ్యకు పిచ్చంటావా అని కోపంతో ఎస్ఐ కాలర్ పట్టుకుంటాడు. దీంతో లాకప్ లో నిన్ను పడేస్తా అంటాడు ఎస్ఐ.
Intinti Gruhalakshmi 27 Dec Today Episode : పోలీస్ స్టేషన్ కు వెళ్లి దివ్యను విడిపించిన రాజ్యలక్ష్మి, విక్రమ్
మా వారి తరుపున నేను సారీ చెబుతున్నాను వదిలేయండి అని రాజ్యలక్ష్మి కమిషనర్ కు ఫోన్ చేసి చెప్పిస్తుంది. దీంతో దివ్యను వదిలేస్తారు. ఈవిడ మాటలు నమ్మి రాత్రంతా మావాళ్లు రోడ్డు మీద చనిపోయిన అమ్మాయి కోసం వెతుకుతూనే ఉన్నారు అంటాడు ఎస్ఐ. దివ్యను రిలీజ్ చేయగానే.. నేను యాక్సిడెంట్ చేశాను అంటుంది దివ్య. దీంతో తనను ఏం మాట్లాడనివ్వకుండా అక్కడి నంచి తీసుకెళ్తారు.
మరోవైపు ఈ లాస్య గోల ఏంటో అర్థం కాదు నందు, అనసూయకు. లాస్య గురించి అసలు నిజం నాన్నగారికి చెప్పేద్దాం అంటాడు నందు. ఇంతలో డాక్టర్ వస్తాడు. నేను, లాస్య ఒకప్పుడు భార్యభర్తలం. చాలా నెలల కిందనే విడాకులు తీసుకున్నాం. కాకపోతే మా నాన్న ఆలోచనలు.. లాస్య నా భార్య అన్న దగ్గరే ఆగిపోయాయి. లాస్య ఇంకా ఈ ఇంటి కోడలు అనుకుంటున్నారు. మేము సరైన రెస్పాన్స్ ఇవ్వడం లేదని అలిగారు. మాతో మాట్లాడటం లేదు అంటాడు నందు.
లాస్య ఈ ఇంటి కోడలు కాదనే విషయాన్ని ఆయనకు చెప్పేద్దామని అనుకుంటున్నాడు మావాడు అంటే పొరపాటున కూడా అలా చెప్పకండి అంటాడు డాక్టర్. ఆయన నమ్మిందే నిజం అనేలా మీరు మసులుకోవాలి అంటాడు డాక్టర్. కొద్దిరోజులు తప్పదు. ఆయనతో పాటు మీరు కూడా అదే భ్రమలో బతకాల్సిందే. లేదంటే చాలా సమస్యలు వస్తాయి అంటాడు డాక్టర్.
ఏ విషయంలో పేషెంట్ ను డిసప్పాయింట్ చేయకండి అంటాడు డాక్టర్. ఆ తర్వాత డాక్టర్ పరందామయ్యను చెక్ చేస్తాడు. మా ఇంట్లో వాళ్లు ఎవ్వరూ సరిగ్గా లేరు అంటాడు పరందామయ్య. ఇంతలో లాస్య ఫోన్ చేస్తుంది డాక్టర్ కు. ఎక్కడున్నావు అంటే.. ఆ ముసలోడి దగ్గరే ఉన్నా అంటాడు. ఏం చేస్తున్నాడు అంటే.. నీ గురించే కలవరిస్తున్నాడు అంటాడు. ఆ ముసలోడిని హిప్నటైజ్ చేసే బదులు.. నా మొగుడిని హిప్నటైజ్ చేయొచ్చు కదా అంటే అది కుదరదు అంటాడు.
లాస్య చాలా మంచిది.. అని ముసలోడికి చెప్పు అంటుంది లాస్య. దీంతో సరే అంటాడు డాక్టర్. తర్వాత మళ్లీ ట్రీట్ మెంట్ స్టార్ట్ చేస్తాడు డాక్టర్. లాస్య చాలా మంచిది అని తన మీద ఎక్కిస్తాడు. లాస్యకు నువ్వంటే చాలా గౌరవం.. ఎంతో ఇష్టం అన్నట్టుగా చూపిస్తాడు. ట్రీట్ మెంట్ పూర్తయ్యాక బయటికి వస్తాడు డాక్టర్. తులసి, నందు నా ఇంటికి వచ్చి నా కాళ్లు పట్టుకుంటారు అని అనుకుంటుంది లాస్య.
మరోవైపు విక్రమ్.. జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం అంటే.. ఆ మాట నువ్వు కాదు దివ్యను చెప్పమను అంటుంది రాజ్యలక్ష్మి. నువ్వు చేసిన పిచ్చి పని వల్ల విక్రమ్ అరెస్ట్ అయ్యేవాడు. ఆ విషయం నీకు తెలుస్తోందా అంటుంది రాజ్యలక్ష్మి.
లాస్యను ఇంటికి తీసుకొచ్చేద్దాం అని అంటుంది తులసి. దీంతో నందు.. లాస్య ఇంటికి వెళ్తాడు. మా నాన్న గారిని రక్షించు ప్లీజ్ అంటాడు. లాస్యను తీసుకొని ఇంటికి వస్తాడు నందు. నాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికీ వెళ్లడానికి వీలు లేదు అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.