Allu Arjun : అదే నిజమైతే అల్లు అర్జున్ మళ్లీ జైలుకేనా…? చుట్టూ ఉచ్చు బిగుస్తుందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun : అదే నిజమైతే అల్లు అర్జున్ మళ్లీ జైలుకేనా…? చుట్టూ ఉచ్చు బిగుస్తుందా..?

 Authored By ramu | The Telugu News | Updated on :22 December 2024,10:29 pm

ప్రధానాంశాలు:

  •  Allu Arjun : అదే నిజమైతే అల్లు అర్జున్ మళ్లీ జైలుకేనా...?.. చుట్టూ ఉచ్చు బిగుస్తుందా..?

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో మహిళ మృతి చెందడం ఆ విషయంపై నెక్స్ట్ డే దాకా హీరో స్పందించకపోవడం. అప్పటిదాకా కేస్ ఫైల్ కాకపోయినా అల్లు అర్జున్ ఆ ఫ్యామిలీని కలిసేందుకు వెల్లకపోవడం ఇదంతా అతని మీద వేలెత్తి చూపించేలా చేస్తున్నాయి. శనివారం ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ తన మీద ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తున్నారని సినిమా మొదలైన కొద్దిసేపటికే థియేటర్ నుంచి వెళ్లానని అన్నాడు అల్లు అర్జున్. ఐతే సీఎం రేవంత్ రెడ్డి, సీపీ ఆనంద్ ల వెర్షన్ ఏంటంటే థియేటర్ బయట మహిళ మృతి చెందిన విషయం అల్లు అర్జున్ కు ముందే అంటే థియేటర్ లో ఉన్నప్పుడే తెలుసని అన్నారు. ఈ విషయాన్ని మాత్రం అల్లు అర్జున్ నెక్స్ట్ డే తెలిసింది. లీగల్ ఇష్యూస్ వల్లే ఆ ఫ్యామిలీని కలవలేదు అన్నారు. ఐతే ఈ మొత్తం ఇష్యూలో అల్లు అర్జున్ మెయిన్ రీజన్ గా చూపిస్తూ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఐతే అరెస్ట్ అయిన 12 గంటల జైలులో ఉన్న అల్లు అర్జున్ ని విడిపించారు…

Allu Arjun అదే నిజమైతే అల్లు అర్జున్ మళ్లీ జైలుకేనా చుట్టూ ఉచ్చు బిగుస్తుందా

Allu Arjun : అదే నిజమైతే అల్లు అర్జున్ మళ్లీ జైలుకేనా…?.. చుట్టూ ఉచ్చు బిగుస్తుందా..?

Allu Arjun పోలీసులు చెప్పిందే నిజమని ప్రూవ్

ఐతే నిన్న ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ తనకు రేవతి చనిపోయిన విషయం నెక్స్ట్ డే తెలిసిందని చెప్పాడు. కానీ పోలీసులు ఆ విషయం థియేటర్ లోనే అల్లు అర్జున్ కి వెల్లడించామని అన్నారు. ఇది ఒకవేళ పోలీసులు చెప్పిందే నిజమని ప్రూవ్ ఐతే మాత్రం అల్లు అర్జున్ ఇంకా రిస్క్ లో పడే ఛాన్స్ ఉంది. అంతేకాదు మహిళ మృతి చెందింది అని తెలిశాక కూడా నేను ఇక్కడే ఉంటా సినిమా చూశాకే వెళ్తానని అల్లు అర్జున్ చెప్పాడని అన్నారు. అది కూడా నిజమని తెలిస్తే మాత్రం అల్లు అర్జున్ కెరీర్ రిస్క్ లో పడినట్టే.

పోలీసులు మాత్రం మీరెంత పెద్ద స్టార్ అయినా చట్టపరంగా ఎవరికీ ఇబ్బంది కలగకుండా చేయాలని అంటున్నారు. కొద్దిసేపటి క్రితమే సీపీ ఆనంద్ మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తూ అల్లు అర్జున్ చెప్పింది తప్పన్నట్టు అన్నారు. సో చూస్తుంటే అల్లు అర్జున్ చుట్టూ మళ్లీ ఉచ్చు బిగుస్తుందని అనిపిస్తుంది. అంతేకాదు మళ్లీ అల్లు అర్జున్ జైలుకి వెళ్లే పరిస్థితి కనబడుతుంది. Allu Arjun, CP Anand, Pushpa 2, Pushpa 2 Premier Show

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది