Dil Raju : ఒక్కడినే ఎందుకు నష్టపోవాలి అంటున్న దిల్ రాజు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dil Raju : ఒక్కడినే ఎందుకు నష్టపోవాలి అంటున్న దిల్ రాజు..!!

తెలుగు పరిశ్రమలో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు దిల్ రాజు. దిల్ సినిమా నిర్మించడం ఆ సినిమా సక్సెస్ అవ్వడం ఆ సినిమా పేరే తన ఇంటిపేరుగా మారిపోయింది. ఇండస్ట్రీ లోను అత్యంత పేరు ప్రఖ్యాతలు ఉన్న నిర్మాతగా సక్సెస్ఫుల్గా సినిమాలు నిర్మిస్తూ ముందుకెళుతున్నాడు దిల్ రాజ్. 2003లో మొదలైన సినిమా నిర్మాణం ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతుంది. ఇక ఇటీవల స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మరోవైపు చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ విజయవంతంగా దూసుకెళుతున్నాడు. ఇటీవల […]

 Authored By prabhas | The Telugu News | Updated on :24 March 2023,12:00 pm

తెలుగు పరిశ్రమలో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు దిల్ రాజు. దిల్ సినిమా నిర్మించడం ఆ సినిమా సక్సెస్ అవ్వడం ఆ సినిమా పేరే తన ఇంటిపేరుగా మారిపోయింది. ఇండస్ట్రీ లోను అత్యంత పేరు ప్రఖ్యాతలు ఉన్న నిర్మాతగా సక్సెస్ఫుల్గా సినిమాలు నిర్మిస్తూ ముందుకెళుతున్నాడు దిల్ రాజ్. 2003లో మొదలైన సినిమా నిర్మాణం ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతుంది. ఇక ఇటీవల స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మరోవైపు చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ విజయవంతంగా దూసుకెళుతున్నాడు. ఇటీవల దిల్ రాజ్ ‘ బలగం ‘ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.

Dil Raju produce movies with partners

Dil Raju produce movies with partners

ఈ సినిమా సక్సెస్ కావడానికి తన వంతు కృషి చేశాడు. ఆ విధంగానే సక్సెస్ అయ్యాడు. ఇక తెలుగు సినిమాలు బాగా తగ్గించేసాడని చెప్పవచ్చు. ఇటీవల పక్క భాషలో కూడా సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈ సంక్రాంతికి విజయ దళపతితో వారసుడు సినిమాను నేరుగా తమిళనాడులో విడుదల చేశారు. ఇక హిందీలో కూడా తానేంటో నిరూపించుకుంటున్నాడు. జెర్సీ హిట్ మొదటి పార్ట్ మరియు ఎఫ్2 సినిమాలను హిందీలో నిర్మించాడు. ప్రస్తుతం హిందీలో ఎఫ్2 సినిమా నిర్మాణ దశలో ఉంది. అక్కడ నిర్మాతలతో కలిసి కూడా కొన్ని సినిమాలు తీస్తున్నారు. ఒక్కడే తీస్తే ఒకవేళ సినిమా డిజాస్టర్ అయితే ఒక్కడే ఎందుకు నష్టపోవాలి అని అనుకుంటున్నాడో

Dil Raju: హిట్ కోసం టాలీవుడ్ ను వదిలేసి తమిళులను నమ్ముకుంటున్న దిల్ రాజు -  OK Telugu

ఏమో కానీ మొత్తానికి ఈ పక్క ప్రొడక్షన్స్ తో చేతులు కలుపుతూ సినిమాలు నిర్మిస్తున్నట్లు కనిపిస్తుంది. 2009లో ఇలా ఒక్కడిగా సినిమా ప్రొడ్యూస్ చేయడం కాకుండా పార్ట్నర్ షిప్ గా సినిమాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే శాకుంతలం సినిమా కొలాబరేటెడ్ ప్రొడక్షన్లో నిర్మించాడు. రామ్ చరణ్ 15 సినిమాను కూడా దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై దిల్ రాజ్ భారీ అంచనాలను పెట్టుకున్నాడు. టాలీవుడ్ లోనే సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజ్ దూసుకెళుతున్నాడు. ఇప్పటివరకు ఆయన సినిమాలు ఒక్కటి కూడా డిజాస్టర్ కాలేదని చెప్పవచ్చు. ఇక త్వరలోనే శాకుంతలం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది