Bimbisara Movie : ‘బింబిసార’ తో దిల్ రాజుకు దక్కబోతున్న లాభం ఎంతో తెలుసా?

Authored By aruna | The Telugu News | Published on: August 8, 2022, 7:00 pm

Bimbisara Movie : నందమూరి కళ్యాణ్ రామ్‌ – Kalyan Ram బింబిసార సినిమా ను దాదాపుగా 40 నుండి 45 కోట్ల రూపాయల బడ్జెట్‌ తో నిర్మించిన విషయం తెల్సిందే. తన గత చిత్రాలు కనీసం పాతిక కోట్లు వసూళ్లు చేసిన దాఖలాలు లేవు. అయినా కూడా అంత బడ్జెట్ తో సినిమాను నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా ను పలువురు చూసి కొనుగోలు చేసేందుకు ధైర్యం చేయలేదట. సినిమాను పాతిక కోట్ల కు కొనుగోలు చేయాల్సిందే అంటూ యూనిట్‌ సభ్యులు అన్నారు. కాని కళ్యాణ్ రామ్ పై అంత బడ్జెట్ ను పెట్టడం మా వల్ల కాదు అంటే మా వల్ల కాదు అంటూ చాలా మంది తప్పుకున్నారు.

బింబిసార వద్దకు దిల్ రాజు – Dil Raju మరియు శిరీష్ – Shirish లు ఎంట్రీ ఇవ్వడం ఆ తర్వాత సినిమాను చూసిన తర్వాత పాజిటివ్ గా రెస్పాండ్‌ అయ్యారట. కాని సినిమా కు మాత్రం కళ్యాణ్ రామ్‌ ఆశించిన మొత్తం లో ఇవ్వలేము అంటూ దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడట. దాంతో కళ్యాణ్ రామ్‌ సినిమా ను కేవలం 13.5 కోట్ల రూపాయలకు మాత్రమే దిల్‌ రాజుకు అమ్మేశాడట. తెలుగు రాష్ట్రాల్లో నందమూరి స్థాయికి అది కాస్త ఎక్కువే అనేది దిల్‌ రాజు అభిప్రాయం. అందుకే కళ్యాణ్ రామ్‌ కూడా ఆ మొత్తం కు ఇచ్చేశాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

Dil Raju Profit with Bimbisara

Dil Raju Profit with Bimbisara

కట్ చేస్తే సినిమా సూపర్ హిట్ అయ్యింది. బింబిసార – Bimbisara సినిమా ఇప్పటికే 20 కోట్ల రూపాయల షేర్‌ ను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే దిల్ రాజు మరియు నిర్మాతలకు లాభాల పంట అనడంలో సందేఏహం లేదు. ముఖ్యంగా నిర్మాత దిల్‌ రాజుకు గత చిత్రం థాంక్యూ తో నష్టపోయిన మొత్తం ను బింబిసార ద్వారా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. అటు ఇటుగా ఏకంగా బింబిసార వల్ల దిల్ రాజుకు దాదాగాపు గా పది కోట్ల లాభాలు దిల్ రాజుకు అధికారికంగానే వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp