Anil Ravipudi : హిట్టైనా కాకపోయినా సీక్వెల్ ఉంటుందా..అనిల్ రావిపూడి ఏం చెబుతున్నాడు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anil Ravipudi : హిట్టైనా కాకపోయినా సీక్వెల్ ఉంటుందా..అనిల్ రావిపూడి ఏం చెబుతున్నాడు..?

 Authored By prabhas | The Telugu News | Updated on :25 May 2022,10:00 pm

Anil Ravipudi : బాలీవుడ్‌లో ఓ సినిమా హిట్ అయితే దాని ఫ్రాంఛైజీలో వరుసగా సీక్వెల్స్ వచ్చి సూపర్ హిట్ సాధిస్తుంటాయి. ధూమ్, క్రిష్ లాంటి యాక్షన్ సినిమాలే కాదు అడల్ట్ కామెడీ చిత్రాలు వచ్చి హిట్ సాధిస్తున్నాయి. ఇప్పుడు అదే టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే, ఎఫ్ 2 ఫ్రాంఛైజీలో ఎఫ్ 3 చిత్రాన్ని తెరకెక్కించారు. ఎఫ్ 2 లో నటించిన విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – తమన్నా – మెహ్రీన్‌లతో పాటు ఈ సిరీస్‌లో సోనాల్ చౌహాన్ – సునీల్ కూడా యాడ్ అయ్యారు.ఇక పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ అదనం.

నిర్మాత దిల్ రాజు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. ఇలా చిత్ర యూనిట్ మొత్తం దాదాపు సేమ్ టు సేమ్. పటాస్ సినిమా నుంచి గత చిత్రం సరిలేరు నీకెవ్వరూ వరకూ వరుసహా హిట్స్ అందుకుంటూ వస్తున్న అనిల్ రావిపూడి ఎఫ్ 3 సక్సెస్ మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ను ‘ఫలక్ నుమా ప్యాలెస్’లో చేశారు. మధ్యలో పాండమిక్ కారణంగా షూటింగు ఆగిపోయినప్పటికీ మళ్ళీ అదే ప్యాలెస్‌లో షూటింగ్ కంటిన్యూ చేశారు. మన తెలుగు చిత్రాలలో ఇంతవరకూ ఈ ప్యాలెస్ లో ఎక్కువ రోజులు షూటింగు జరుపుకున్న సినిమా ఎఫ్ 3 కావడం విశేషం.

Director Anil Ravipudi About F3 Movie

Director Anil Ravipudi About F3 Movie

Anil Ravipudi : ఎఫ్ 3 హిట్ అవనీయండి అప్పుడు ఎఫ్ 4 గురించి ఆలోచిద్దురు..

మైసూర్ ప్యాలెస్‌లో అనుకున్నది కరోనా అవ్ల్ల ఇక్కడ సెట్ అయింది. అయితే, ఇటీవల ఎఫ్ 3 ప్రమోషన్స్‌లో ఎఫ్ 4 కూడా ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. దాంతో ఎఫ్ 2 హిట్టైనంతగా ఎఫ్ 3 కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే, నెటిజన్స్ కొందరు ముందు ఎఫ్ 3 హిట్ అవనీయండి అప్పుడు ఎఫ్ 4 గురించి ఆలోచిద్దురు అనేట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఎఫ్ 3 ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది