Mannara Chopra : నేనేమైనా కసిగా ముద్దు పెట్టానా? ఆ అమ్మాయికి లేని నొప్పి మీకెందుకు? డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్

Advertisement

Mannara Chopra : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే చర్చ. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి.. హీరోయిన్ మన్నారా చోప్రాకు పెట్టిన ముద్దు గురించే చర్చ నడుస్తోంది. తిరగబడరా సామి అనే సినిమాకు ఆయన డైరెక్టర్ అని తెలుసు కదా. రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న సినిమా అది. ఆ సినిమా టీజర్ రిలీజ్  ఈవెంట్ లోనే ఏఎస్ రవికుమార్ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏఎస్ రవికుమార్ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో ఆ సినిమాలో నెగెటివ్ రోల్ చేసిన హీరోయిన్ మన్నార చోప్రాపై చేయి వేసి ఫోటోలకు పోజులిచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు రవి కుమార్.

Advertisement

దీంతో ఒక్కసారిగా హీరోయిన్ మన్నార్ చొప్రా షాక్ అయింది. కానీ.. మీడియా ముందు కావడంతో ఆశ్చర్యపడ్డట్టుగా ఒక్క నవ్వు నవ్వింది. పబ్లిక్ గా అలా కెమెరాల ముందు మన్నార్ చోప్రాకు ముద్దు పెట్టడంపై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన్నార చోప్రా ఈ విషయాలన్ని లైట్ తీసుకున్నా నెటిజన్లు మాత్రం ఆయనపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నారు.మన్నార చోప్రాకు ముద్దుపెట్టడంపై ఒక్కసారిగా ఏఎస్ రవి కుమార్ చౌదరి లైమ్ లైట్ లోకి వచ్చేశారు. చాలా ఏళ్ల పాటు ఇండస్ట్రీలో గ్యాప్ తీసుకున్న ఈయన తాజాగా తిరగబడరా సామి అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. అయితే.. మన్నార చొప్రాకు ముద్దు పెట్టడంతో ఒక్కసారిగా ఆయన సినిమాకు భారీగా ప్రమోషన్ లభించినట్టు అయింది. అయితే.. తనపై వస్తున్న విమర్శలపై తాజాగా రవి కుమార్ స్పందించారు. నేను ఏమైనా ఆమెకు కసిగా ముద్దు పెట్టానా… ఆ అమ్మాయికి లేని నొప్పి మీకెందుకు..

Advertisement
director as ravi kumar opens up about his kss to mannara chopra
Mannara Chopra : నేనేమైనా కసిగా ముద్దు పెట్టానా? ఆ అమ్మాయికి లేని నొప్పి మీకెందుకు? డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్

Mannara Chopra : విపరీతంగా పాపులారిటీ సంపాదించుకున్న రవికుమార్ చౌదరి

మీడియా ఎందుకు ఈ విషయంపై అంత హంగామా చేస్తోందంటూ ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఏదో కాజువల్ గా నేను ఆమెకు ముద్దు పెట్టాను. అది అనురాగానికి చిహ్నం. ఆ ప్లేస్ లో నా కూతురు ఉన్నా కూడా అలాగే ముద్దు పెడతా. ఆ ముద్దు వల్ల మన్నారకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మరి మీడియాకు ఎందుకు నొప్పి కలిగిందో అంటూ రవి కుమార్ చౌదరి చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement