Anasuya : అనసూయ అలాంటిదే.. చెప్పబోతోన్న డైరెక్టర్ నోర్మూసిన యాంకర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anasuya : అనసూయ అలాంటిదే.. చెప్పబోతోన్న డైరెక్టర్ నోర్మూసిన యాంకర్

Anasuya : యాంకర్ అనసూయ బుల్లితెరపై ఎంత బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు స్టార్ మాలోనూ ఓ షో చేస్తోంది. ఇటు జబర్దస్త్, అటు సింగింగ్ షో.. మరో వైపు పండుగ ఈవెంట్లు ఫుల్ బిజీగా ఉంటుంది. ఇలా ఎంత బిజీగా ఉన్నా కూడా సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన టైం కేటాయిస్తుంటుంది. తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తుంటుంది. అలా తనకు ఎన్ని అవకాశాలు వచ్చినా అందులో కొన్ని మాత్రమే సెలెక్ట్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :25 June 2022,6:00 pm

Anasuya : యాంకర్ అనసూయ బుల్లితెరపై ఎంత బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు స్టార్ మాలోనూ ఓ షో చేస్తోంది. ఇటు జబర్దస్త్, అటు సింగింగ్ షో.. మరో వైపు పండుగ ఈవెంట్లు ఫుల్ బిజీగా ఉంటుంది. ఇలా ఎంత బిజీగా ఉన్నా కూడా సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన టైం కేటాయిస్తుంటుంది. తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తుంటుంది. అలా తనకు ఎన్ని అవకాశాలు వచ్చినా అందులో కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇదే విషయాన్ని తాజాగా దర్శకుడు మారుతి కూడా చెప్పేశాడు. దర్శకుడు మారుతి ఇప్పుడు మరింత బిజీగా మారిపోయాడు. గోపీచంద్, రాశీ ఖన్నాలను పెట్టి పక్కా కమర్షియల్ అనే చిత్రాన్ని తీసిన సంగతి తెలిసిందే.

ఈమూవీ జూలై 1న విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీని విస్తృతంగా ప్రచారం చేయాలని భావించినట్టుంది. అందుకే మారుతి గత కొన్ని రోజులుగా మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు జబర్దస్త్ షోకు మారుతి, గోపీచంద్‌లు గెస్టులుగా వచ్చారు. ఇందులో గోపీచంద్ తన డైలాగ్స్‌తో రెచ్చిపోయాడు. ఇక మారుతి తన స్టైల్లో మాట్లాడేశాడు. అనసూయ పక్కా కమర్షియల్ అంటూ ఆమె గురించి కొన్ని విషయాలు చెప్పబోయాడు. చిన్న ఆఫర్ ఇస్తే.. నో చెప్పిందంటూ పక్కా కమర్షియల్ అని ఏదో చెప్పబోయాడు మారుతి.

Director Maruthi About Anasuya In Jabardasth Promo

Director Maruthi About Anasuya In Jabardasth Promo

కానీ అనసూయ మాత్రం అతని నోరు మూసేసింది. అలా మొత్తానికి అనసూయ గురించి ఏదో సీక్రెట్ బయటకు రావాల్సింది. అయితే ప్రోమోలో ఇంత వరకు మాత్రమే ఉంది. పూర్తి ఎపిసోడ్‌లో ఏమైనా ఇంకా విషయాలు చెప్పి ఉంటాడు. మొత్తానికి అనసూయ మాత్రం అలాంటి చిన్న చిన్న రోల్స్ చేసేంత ఖాళీగా అయితే లేదు. అనసూయ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2, తన లేడీ ఓరియెటెంటెడ్ చిత్రాలతో బిజీగా ఉంది. ఇక మరో వైపు కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తమిళ, తెలుగు ద్వి భాష చిత్రాలను కూడా చేస్తోన్నట్టుంది. అయితే మాలీవుడ్‌లోనూ అనసూయ ఎంట్రీ అయిపోయింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది